Title (Indic)ఊరకున్నవారి మమ్ము నుండనీకేల రేఁచీనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఊరకున్నవారి మమ్ము నుండనీకేల రేఁచీనే మారుమాటాడక యిన్నీ మఱచుండుఁ గాక (॥ఊర॥) ఇంతపరాకయ్యేవాఁ డేల పిలువనంపీనే చెంత నేఁడే పనులెల్లాఁజేసుఁగాక కొంత సిగ్గువడేవాఁడు కొంగువట్టేల తీసీనే వంతులఁ దా బాలనాటివలె నుండుఁగాక (॥ఊర॥) జాగులు సేసేవాఁడు సన్నలేల సేసినే వేగుదాఁక జాగరాలు వేగించుఁగాక బాగుగ నిద్రించేవాఁడు పైనేల వొరగీనే వేగమే పానుపుమీఁద విహరించుగాఁక (॥ఊర॥) రాజసము చూపేవాఁడు రతికేల దగ్గరీనే వోజతోడ మమ్ము నంపి వుండుగాఁక సాజపు శ్రీవేంకటాద్రి సరసుఁడై నన్నుఁ గూడె జూజమేలాడీనే యిట్టే సుకియించుఁగాక English(||pallavi||) ūragunnavāri mammu nuṁḍanīgela rem̐sīne mārumāḍāḍaga yinnī maṟasuṁḍum̐ gāga (||ūra||) iṁtabarāgayyevām̐ ḍela piluvanaṁpīne sĕṁta nem̐ḍe panulĕllām̐jesum̐gāga kŏṁta sigguvaḍevām̐ḍu kŏṁguvaṭṭela tīsīne vaṁtulam̐ dā bālanāḍivalĕ nuṁḍum̐gāga (||ūra||) jāgulu sesevām̐ḍu sannalela sesine vegudām̐ka jāgarālu vegiṁchum̐gāga bāguga nidriṁchevām̐ḍu painela vŏragīne vegame pānubumīm̐da vihariṁchugām̐ka (||ūra||) rājasamu sūbevām̐ḍu radigela daggarīne vojadoḍa mammu naṁpi vuṁḍugām̐ka sājabu śhrīveṁkaḍādri sarasum̐ḍai nannum̐ gūḍĕ jūjamelāḍīne yiṭṭe sugiyiṁchum̐gāga