Title (Indic)ఊరకుంటే నన్ను నుండనియ్యవు ఇంత WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఊరకుంటే నన్ను నుండనియ్యవు ఇంత పేరుకుచ్చి తిట్ట నన్నుఁ బ్రియమా నీకు (॥ఊర॥) బుజముపైఁ జేయి వేసి బుజ్జగించేవు ఇంత- నిజమా నామీఁద నీ కరుణ భజన మొరయ నన్నుఁ బచ్చి సేసేవు ఇంత- గజరుఁజేఁతలకోపఁగలనా యిఁకను (॥ఊర॥) కాలుమీఁదఁ గాలువేసి కరఁగించేవు యింత- మేలా నాతోడి సమేళములు వాలుకచూపుల నాకు వాఁడివెట్టేవు యింత- యేలికవై యిటుసేయనేలా యిపుడు (॥ఊర॥) చక్కఁదనమిది నాది జట్టిసేసేవు నా చెక్కుల రేకలు వ్రాయఁ జిత్తగించేవు చక్కని వేంకటగిరిస్వామీ నీవు యిట్టే దక్కిన నన్నింత సేయఁ దగునా యిఁకను English(||pallavi||) ūraguṁṭe nannu nuṁḍaniyyavu iṁta peruguchchi tiṭṭa nannum̐ briyamā nīgu (||ūra||) bujamubaim̐ jeyi vesi bujjagiṁchevu iṁta- nijamā nāmīm̐da nī karuṇa bhajana mŏraya nannum̐ bachchi sesevu iṁta- gajarum̐jem̐talagobam̐galanā yim̐kanu (||ūra||) kālumīm̐dam̐ gāluvesi karam̐giṁchevu yiṁta- melā nādoḍi sameḽamulu vālugasūbula nāgu vām̐ḍivĕṭṭevu yiṁta- yeligavai yiḍuseyanelā yibuḍu (||ūra||) sakkam̐danamidi nādi jaṭṭisesevu nā sĕkkula regalu vrāyam̐ jittagiṁchevu sakkani veṁkaḍagirisvāmī nīvu yiṭṭe dakkina nanniṁta seyam̐ dagunā yim̐kanu