Title (Indic)ఊరకేల భ్రమసేవు వొగినేల పొగడేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఊరకేల భ్రమసేవు వొగినేల పొగడేవు నేరమా నేమందరము నీకే తెలిసీని (॥ఊర॥) కతలు తొల్లె భూమిఁ గలవె కావా నేఁ డీ సతి నీతోఁ జెప్పఁగానే చవులాయను గతులైన చూపులు కన్నుల సాజమే కాదా తతి నాపె చూడఁగా నీమతి నాటీఁగాక (॥ఊర॥) అందరిచ్చేకానుకలు అరచేతిలోవేకావా ఇందుమఖి యియ్యఁగా నీ కింపాయఁగాక చిందేటి నవ్వు లింతులసెలవులవే కావా చెంది యాపె నవ్వఁగా నీ కందమాయఁగాక (॥ఊర॥) వింతమొక్కలు లోకులవినోదములే కావా యింతి మొక్కఁగా రతికెక్కెఁగాక ఇంతలోన శ్రీవేంకటేశ నన్ను నేలితివి చెంత నాపెఁ గూడఁగా నచ్చెరువాయఁగాక English(||pallavi||) ūragela bhramasevu vŏginela pŏgaḍevu neramā nemaṁdaramu nīge tĕlisīni (||ūra||) kadalu tŏllĕ bhūmim̐ galavĕ kāvā nem̐ ḍī sadi nīdom̐ jĕppam̐gāne savulāyanu gadulaina sūbulu kannula sājame kādā tadi nābĕ sūḍam̐gā nīmadi nāḍīm̐gāga (||ūra||) aṁdarichchegānugalu arasedilovegāvā iṁdumakhi yiyyam̐gā nī kiṁpāyam̐gāga siṁdeḍi navvu liṁtulasĕlavulave kāvā sĕṁdi yābĕ navvam̐gā nī kaṁdamāyam̐gāga (||ūra||) viṁtamŏkkalu logulavinodamule kāvā yiṁti mŏkkam̐gā radigĕkkĕm̐gāga iṁtalona śhrīveṁkaḍeśha nannu nelidivi sĕṁta nābĕm̐ gūḍam̐gā nachchĕruvāyam̐gāga