Title (Indic)ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు తక్కినవి యిన్నియును తలఁపు రేఁచెడిని (॥ఒక్క॥) యెఱుఁగుమీ జీవుఁడా యింద్రియాలు సొమ్ము గావు గుఱియై మాయలలోనఁ గూడించే వింతె మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు తెఱఁగొప్ప ఆసలానే తిప్పెడి దింతె (॥ఒక్క॥) తెలుకో జీవుఁడా దేహమును నమ్మరాదు వలసితే నుండుఁ బోవు వన్నెవంటిది తలఁచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు పలులంపటములచేఁ బరచెడి దింతె (॥ఒక్క॥) సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె యిమ్ముల శ్రీవేంకటేశ డితనిమూలమే యింత నెమ్మిఁ దానే గతియంటే నిత్యమవు నింతే English(||pallavi||) ŏkkam̐ḍe aṁtaryāmi vubagāri sebaṭṭu takkinavi yinniyunu talam̐pu rem̐sĕḍini (||ŏkka||) yĕṟum̐gumī jīvum̐ḍā yiṁdriyālu sŏmmu gāvu guṟiyai māyalalonam̐ gūḍiṁche viṁtĕ maṟavagu jīvuḍā manasu suṭṭamu gādu tĕṟam̐gŏppa āsalāne tippĕḍi diṁtĕ (||ŏkka||) tĕlugo jīvum̐ḍā dehamunu nammarādu valaside nuṁḍum̐ bovu vannĕvaṁṭidi talam̐sugo jīvuḍā dhanamu danichcha gādu palulaṁpaḍamulasem̐ barasĕḍi diṁtĕ (||ŏkka||) sammadiṁchu jīvuḍā saṁsāra mŏgajāḍa gādu bimmaḍi pŏddŏgajāḍa pĕnasu niṁtĕ yimmula śhrīveṁkaḍeśha ḍidanimūlame yiṁta nĕmmim̐ dāne gadiyaṁṭe nityamavu niṁte