Title (Indic)ఒద్దనున్న కాంతలకు నుల్లములు గరగెను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఒద్దనున్న కాంతలకు నుల్లములు గరగెను సుద్దులేమి చెప్పేము చూతువు రావయ్యా (॥॥) పట్టెమంచము మీఁదటఁ బవ్వళించీని చెలియ నెట్టుకొన్నవేడుకతో నిన్నుఁ దలఁచి గుట్టున మనోరథాలు గోరుకోంటా ముక్కుమీఁది- జుట్టవేలితో నున్నది చూతువు రావయ్యా (॥॥) వొక్కతె యేకతముననండి యుల్లసముతోడ పక్కన నీమీఁదటి పదాలు వాడి యిక్కువ నీమోవితేనె కేకట నోరూరుకొంటా చొక్కి నిట్టూర్పులు నించీఁ జూతువు రావయ్యా (॥॥) ఇట్టె నీవు రాగా శిరసెత్తి నీమొగము చూచి గట్టిగా శ్రీ వేంకటేశ కాఁగిట గూడిఁ నెట్టుకొని రతులను నిన్ను మెప్పించీ దినముఁ జుట్టి చుట్టి ఇట్లానే చూతువు రావయ్యా English(||pallavi||) ŏddanunna kāṁtalagu nullamulu garagĕnu suddulemi sĕppemu sūduvu rāvayyā (||||) paṭṭĕmaṁchamu mīm̐daḍam̐ bavvaḽiṁchīni sĕliya nĕṭṭugŏnnaveḍugado ninnum̐ dalam̐si guṭṭuna manorathālu gorugoṁṭā mukkumīm̐di- juṭṭavelido nunnadi sūduvu rāvayyā (||||) vŏkkadĕ yegadamunanaṁḍi yullasamudoḍa pakkana nīmīm̐daḍi padālu vāḍi yikkuva nīmovidenĕ kegaḍa norūrugŏṁṭā sŏkki niṭṭūrbulu niṁchīm̐ jūduvu rāvayyā (||||) iṭṭĕ nīvu rāgā śhirasĕtti nīmŏgamu sūsi gaṭṭigā śhrī veṁkaḍeśha kām̐giḍa gūḍim̐ nĕṭṭugŏni radulanu ninnu mĕppiṁchī dinamum̐ juṭṭi suṭṭi iṭlāne sūduvu rāvayyā