Title (Indic)ఓపనోప నింతేసికి వోయయ్య నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఓపనోప నింతేసికి వోయయ్య నేను కోపగించకున్నాను కొడిమె లెంచేవు (॥॥) నగితిఁబో అందుకేమి నాలోనే వొకవేళ నీమీఁద నెట్టైనా వొచ్చె మంటినా చిగురుఁబెదవి గొంత చిమ్మి కదిలించితిఁబో జగడించ నీకేల సారెకు దిట్టితినా (॥॥) వుసురంటిఁబో నే నొడలియలపుతోడ కసరి నిన్నేమైనాఁ గాదంటినా అసుదై వూరకుంటిఁబో అంతలోనే నీవు నన్ను వెస నిట్టే జరసేవు వేగిరపడితినా (॥॥) కాఁగిలించితిబో నిన్ను కాఁకలు మేన నిండఁగా రాఁగిననీ మేనికాఁక రవ్వపెట్టేనా వీఁగక శ్రీ వేంకటేశ వేడుక నన్నుఁ గూడితి దాఁగనేల నీమాట దాఁటఁగలనా English(||pallavi||) obanoba niṁtesigi voyayya nenu kobagiṁchagunnānu kŏḍimĕ lĕṁchevu (||||) nagidim̐bo aṁdugemi nālone vŏgaveḽa nīmīm̐da nĕṭṭainā vŏchchĕ maṁṭinā sigurum̐bĕdavi gŏṁta simmi kadiliṁchidim̐bo jagaḍiṁcha nīgela sārĕgu diṭṭidinā (||||) vusuraṁṭim̐bo ne nŏḍaliyalabudoḍa kasari ninnemainām̐ gādaṁṭinā asudai vūraguṁṭim̐bo aṁtalone nīvu nannu vĕsa niṭṭe jarasevu vegirabaḍidinā (||||) kām̐giliṁchidibo ninnu kām̐kalu mena niṁḍam̐gā rām̐ginanī menigām̐ka ravvabĕṭṭenā vīm̐gaga śhrī veṁkaḍeśha veḍuga nannum̐ gūḍidi dām̐ganela nīmāḍa dām̐ṭam̐galanā