Title (Indic)నిన్నుఁ జూచి తనివంది నిలుచున్నది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నిన్నుఁ జూచి తనివంది నిలుచున్నది వున్నతి నీ సతివలె నుండవద్దా వలపు (॥నిన్ను॥) వినివిని నీమాఁటల వెరగుతోడ నున్నది ననుపుఁజేతలకును నవ్వుచున్నది చనవు నీవియ్యఁగాను సంతోసముతో నున్నది యెనసి రతిసలుప నెఱఁగకవున్నది (॥నిన్ను॥) తప్పక నీవు చూచితే తగులమితో నున్నది వొప్పగఁ జేయివేసితే వొగ్గుచున్నది కప్పిన పయ్యదంటితే కరఁగుతాఁదా నున్నది దప్పికి మోవియడుఁగ దలపోయుచున్నది (॥నిన్ను॥) చేరి నీవు చెనకితే చిమ్మిరేఁగుతానున్నది యీరతి నీకాఁగిఁట బెంపెక్కివున్నది గారవాన నేఁడు శ్రీవేంకటేశుఁ గూడఁగాను నేరుపుతో నీవురాన నెలకొనివున్నది English(||pallavi||) ninnum̐ jūsi tanivaṁdi nilusunnadi vunnadi nī sadivalĕ nuṁḍavaddā valabu (||ninnu||) vinivini nīmām̐ṭala vĕragudoḍa nunnadi nanubum̐jedalagunu navvusunnadi sanavu nīviyyam̐gānu saṁtosamudo nunnadi yĕnasi radisaluba nĕṟam̐gagavunnadi (||ninnu||) tappaga nīvu sūside tagulamido nunnadi vŏppagam̐ jeyiveside vŏggusunnadi kappina payyadaṁṭide karam̐gudām̐dā nunnadi dappigi moviyaḍum̐ga dalaboyusunnadi (||ninnu||) seri nīvu sĕnagide simmirem̐gudānunnadi yīradi nīgām̐gim̐ṭa bĕṁpĕkkivunnadi gāravāna nem̐ḍu śhrīveṁkaḍeśhum̐ gūḍam̐gānu nerubudo nīvurāna nĕlagŏnivunnadi