Title (Indic)నిండెను లోకములెల్ల నెరి నితని కరుణ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నిండెను లోకములెల్ల నెరి నితని కరుణ పండి రాసులాయఁ గీర్తిప్రతాపములెల్లను (॥నిండె॥) గరుడవేగమునఁ గదలె విజయరథ- మిరవై యందు దేవుడేఁగుచుండఁగా సొరిదిఁ బట్టుకుచ్చులు చుక్కలతో సందడించ గరిమఁ బైఁడికుండలు గగనముదాఁకను (॥నిండె॥) అనిలవేగమున నదెవెడలె రథము ఆనిమిషులు పగ్గములందుకొనఁగా తనుఁదానె ఘనశంఖధ్వనులు దిక్కులనిండ సునిసి చక్రము దనుజుల సాధింపఁగను (॥నిండె॥) వెలయ మనోవేగాన వేంచేసీ మగిడి రథ- మెలమిఁ దమదాసులు యేచి పొగడ అలమేలుమంగ దనకటు విడెమియ్యఁగాను బలిమి శ్రీవేంకటాద్రిపతి మించీనిందును English(||pallavi||) niṁḍĕnu logamulĕlla nĕri nidani karuṇa paṁḍi rāsulāyam̐ gīrdipradābamulĕllanu (||niṁḍĕ||) garuḍavegamunam̐ gadalĕ vijayaratha- miravai yaṁdu devuḍem̐gusuṁḍam̐gā sŏridim̐ baṭṭuguchchulu sukkalado saṁdaḍiṁcha garimam̐ baim̐ḍiguṁḍalu gaganamudām̐kanu (||niṁḍĕ||) anilavegamuna nadĕvĕḍalĕ rathamu ānimiṣhulu paggamulaṁdugŏnam̐gā tanum̐dānĕ ghanaśhaṁkhadhvanulu dikkulaniṁḍa sunisi sakramu danujula sādhiṁpam̐ganu (||niṁḍĕ||) vĕlaya manovegāna veṁchesī magiḍi ratha- mĕlamim̐ damadāsulu yesi pŏgaḍa alamelumaṁga danagaḍu viḍĕmiyyam̐gānu balimi śhrīveṁkaḍādribadi miṁchīniṁdunu