Title (Indic)నిక్కించీ గర్ణములు మానిసిమెకము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నిక్కించీ గర్ణములు మానిసిమెకము నిక్కపుఁ గరుణతో మానిసిమెకము (॥నిక్కి॥) కొండ తనకు గద్దెగా గోరి కూచుండిన దదే నిండురాజసమున మానిసిమెకము గండుమీరి దానవునికండలు చెక్కుచు నూర్పు నిండించీ నాకసము మానిసిమెకము (॥నిక్కి॥) కరములు వేయింటాఁ గైకొని యాయుధములు నిరతి జళిపించీ మానిసిమెకము సురలను నసురల జూచిచూచి మెచ్చిమెచ్చి నెరపీని నవ్వులు మానిసిమెకము (॥నిక్కి॥) యెక్కించి తొడమీఁద నిందిరతో మేలమాడీ నిక్కపుగాఁగిటను మానిసిమెకము అక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందు నెక్కొని మమ్మేలెను మానిసిమెకము English(||pallavi||) nikkiṁchī garṇamulu mānisimĕgamu nikkabum̐ garuṇado mānisimĕgamu (||nikki||) kŏṁḍa tanagu gaddĕgā gori kūsuṁḍina dade niṁḍurājasamuna mānisimĕgamu gaṁḍumīri dānavunigaṁḍalu sĕkkusu nūrbu niṁḍiṁchī nāgasamu mānisimĕgamu (||nikki||) karamulu veyiṁṭām̐ gaigŏni yāyudhamulu niradi jaḽibiṁchī mānisimĕgamu suralanu nasurala jūsisūsi mĕchchimĕchchi nĕrabīni navvulu mānisimĕgamu (||nikki||) yĕkkiṁchi tŏḍamīm̐da niṁdirado melamāḍī nikkabugām̐giḍanu mānisimĕgamu akkaḍa śhrīveṁkaḍādri nahobalamunaṁdu nĕkkŏni mammelĕnu mānisimĕgamu