Title (Indic)నేరుపు గలితేఁ జాలు నీవే నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేరుపు గలితేఁ జాలు నీవే నేను దూరి మాటాట నోప మందు లిట్టె నూరకురా (॥నేరుప॥) యెప్పడు నీ వారమే యేల పిలిచేవు మమ్ము చప్ప నై నీ నోరు నొచ్చీఁ జాలించ రాదా నెప్పున నే నీడ నుంటే నీ వద్ద నుండుట గాదా ముప్పిరిఁ బెనఁగ నోప ముంజుయి వట్టకురా (॥నేవుప॥) వూడిగపువార మింతే వొడ లేల నిమిరేవు తోడ నీచేతు లరిగీఁ దొలఁగ రాదా నీడల నే నవ్వితేనె నీ పరిణామము గాదా వీడ నాడ నే నోప వేసాలు సేయకురా (॥నేరుప॥) నీకు మేనదాన నింతే నీ వేల కిందు పడేవు కాకై నీ రాజసము కైకో రాదా యీకడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి నీకు నే సరిగా నోప నీ వంత మెచ్చకురా English(||pallavi||) nerubu galidem̐ jālu nīve nenu dūri māḍāḍa noba maṁdu liṭṭĕ nūragurā (||neruba||) yĕppaḍu nī vārame yela pilisevu mammu sappa nai nī noru nŏchchīm̐ jāliṁcha rādā nĕppuna ne nīḍa nuṁṭe nī vadda nuṁḍuḍa gādā muppirim̐ bĕnam̐ga noba muṁjuyi vaṭṭagurā (||nevuba||) vūḍigabuvāra miṁte vŏḍa lela nimirevu toḍa nīsedu larigīm̐ dŏlam̐ga rādā nīḍala ne navvidenĕ nī pariṇāmamu gādā vīḍa nāḍa ne noba vesālu seyagurā (||neruba||) nīgu menadāna niṁte nī vela kiṁdu paḍevu kāgai nī rājasamu kaigo rādā yīgaḍa śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi nīgu ne sarigā noba nī vaṁta mĕchchagurā