Title (Indic)నేనొక్కఁడ లేకుండితే నీ కృపకుఁ బాత్రమేది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేనొక్కఁడ లేకుండితే నీ కృపకుఁ బాత్రమేది పూని నా వల్లనే కీర్తిఁ బొందేవు నీవు (॥నేనొ॥) అతిమూఢులలోన నగ్రేసరుఁడ నేను ప్రతిలేని ఘనగర్వపర్వతమను తతిఁ బంచేంద్రియముల ధనవంతుఁడను నేను వెతకి నావంటివాని విడువఁగఁ జెల్లునా (॥నేనొ॥) మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాఁడ నేను యిహమునఁ గర్మ వహికెక్కితి నేను బహుయోనికూపసంపదఁ దేలేవాఁడ నేను వహించుక నావంటివానిఁ దేనోపేవా (॥నేనొ॥) భావించి నావంటి నీచుఁ బట్టి కాచినప్పుడుగా యేవంక నీకీర్తి గడునెంతురు భువి నావల్ల నీకుఁ బుణ్యము నీవల్ల నే బ్రదుకుదు శ్రీవేంకటేశుఁడ యింత చేరెఁ జుమ్మీ మేలు English(||pallavi||) nenŏkkam̐ḍa leguṁḍide nī kṛpagum̐ bātramedi pūni nā vallane kīrdim̐ bŏṁdevu nīvu (||nenŏ||) adimūḍhulalona nagresarum̐ḍa nenu pradileni ghanagarvabarvadamanu tadim̐ baṁcheṁdriyamula dhanavaṁtum̐ḍanu nenu vĕdagi nāvaṁṭivāni viḍuvam̐gam̐ jĕllunā (||nenŏ||) mahilo saṁsārabusāmrājyamelevām̐ḍa nenu yihamunam̐ garma vahigĕkkidi nenu bahuyonigūbasaṁpadam̐ delevām̐ḍa nenu vahiṁchuga nāvaṁṭivānim̐ denobevā (||nenŏ||) bhāviṁchi nāvaṁṭi nīsum̐ baṭṭi kāsinappuḍugā yevaṁka nīgīrdi gaḍunĕṁturu bhuvi nāvalla nīgum̐ buṇyamu nīvalla ne bradugudu śhrīveṁkaḍeśhum̐ḍa yiṁta serĕm̐ jummī melu