Title (Indic)నేనే పిలువ ననే నేర మేమి గలిగినా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేనే పిలువ ననే నేర మేమి గలిగినా దీన నైన తప్పు మీఁద దిద్దుకొనేఁ గాని (॥నేనే॥) వలపు బలిమి సేసి వంతకుఁ బెనఁగఁ బోతే చలువలే వేఁ డౌను సతులాల వెల నున్నరమణుని వేడుక నేఁ బిలిచితే చులుకఁదనము రాదా చూడఁ గానె యిపుడూ (॥నేనే॥) మనసు రానిచోట మాటలఁ గొసరఁ బోతే చన వెల్లాఁ జవి దప్పు జాణలాల ననుపు లేనిపతితో నవ్వులు నవ్వఁగఁ బేతే పని మాలినది గాదా పై పైనె యిపుడూ (॥నేనే॥) దరదరిఁ గాక నే దగ్గరి కూడఁగఁ బోతే సరసమే విరస మౌ సకియలాల యిర వై శ్రీవెంకటేశుఁ డిట్టె విచ్చేసి కూడె దొరతన మిది గాదా తుద కెక్కె నిపుడూ English(||pallavi||) nene piluva nane nera memi galiginā dīna naina tappu mīm̐da diddugŏnem̐ gāni (||nene||) valabu balimi sesi vaṁtagum̐ bĕnam̐gam̐ bode saluvale vem̐ ḍaunu sadulāla vĕla nunnaramaṇuni veḍuga nem̐ biliside sulugam̐danamu rādā sūḍam̐ gānĕ yibuḍū (||nene||) manasu rānisoḍa māḍalam̐ gŏsaram̐ bode sana vĕllām̐ javi dappu jāṇalāla nanubu lenibadido navvulu navvam̐gam̐ bede pani mālinadi gādā pai painĕ yibuḍū (||nene||) daradarim̐ gāga ne daggari kūḍam̐gam̐ bode sarasame virasa mau sagiyalāla yira vai śhrīvĕṁkaḍeśhum̐ ḍiṭṭĕ vichchesi kūḍĕ dŏradana midi gādā tuda kĕkkĕ nibuḍū