Title (Indic)నేము వచ్చి తడవాయ నీ జాగెంతైనాఁ గద్దు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేము వచ్చి తడవాయ నీ జాగెంతైనాఁ గద్దు రామ వద్దికి నిప్పుడే రాఁగదవయ్యా (॥నేము॥) మాపుదాఁకా నీతోను మాటలాడనే పట్టె యేపొద్దు చెలియవద్ది కేఁగేదయ్యా చూపుల నీసింగారాలు చూడనే యిందాఁకాఁబట్టె ఆపె వూడిగాన నెప్పుడండనుండేమయ్యా (॥నేము॥) కాచుకుండి నీ కిందాఁకాఁ గానుకలియ్యనే పట్టె ఆ చెలితో మారుమాటేమనేమయ్యా చేచేత నీ చేఁతలకు సెలవినవ్వనే పట్టె చూచి యాపెతో నేపొద్దు జూజమాడేమయ్యా (॥నేము॥) రాజసపు నిన్నింటికి రప్పించనే పట్టె తేజము లాపెకెప్పుడు తెలిపేమయ్యా సాజాన శ్రీ వేంకటేశ సతినిట్టె గూడితివి యీజాడ నింకనెట్టు యెచ్చరించేమయ్యా English(||pallavi||) nemu vachchi taḍavāya nī jāgĕṁtainām̐ gaddu rāma vaddigi nippuḍe rām̐gadavayyā (||nemu||) mābudām̐kā nīdonu māḍalāḍane paṭṭĕ yebŏddu sĕliyavaddi kem̐gedayyā sūbula nīsiṁgārālu sūḍane yiṁdām̐kām̐baṭṭĕ ābĕ vūḍigāna nĕppuḍaṁḍanuṁḍemayyā (||nemu||) kāsuguṁḍi nī kiṁdām̐kām̐ gānugaliyyane paṭṭĕ ā sĕlido mārumāḍemanemayyā seseda nī sem̐talagu sĕlavinavvane paṭṭĕ sūsi yābĕdo nebŏddu jūjamāḍemayyā (||nemu||) rājasabu ninniṁṭigi rappiṁchane paṭṭĕ tejamu lābĕgĕppuḍu tĕlibemayyā sājāna śhrī veṁkaḍeśha sadiniṭṭĕ gūḍidivi yījāḍa niṁkanĕṭṭu yĕchchariṁchemayyā