Title (Indic)నేమే దొరసానులము నేరక లోననుందుము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేమే దొరసానులము నేరక లోననుందుము సాముసేయ నెంతలేదు సముకపువారికి (॥నేమే॥) సిగ్గువడ నెంతలేదు చెయిచాఁచ నెంతలేదు దగ్గరి సేవలు సేసే తరుణులకు వొగ్గి పిల్వ నెంతలేదు వోపనన నెంతలేదు అగ్గలమై కాచుక అండనుండేవారికి (॥నేమే॥) అందిపొంద నెంతలేదు ఆనవెట్టు నెంతలేదు కందువనుండేటి వూడిగపువారికి చెందికూడ నెంతలేదు చెల్లించుకో నెంతలేదు యెందుకైనానొడిగట్టే యింటిలోనివారికి (॥నేమే॥) రవ్వసేయ నెంతలేదు రచ్చకెక్క నెంతలేదు నవ్వులు నవ్వించే మన్ననవారికి జవ్వనపు శ్రీ వెంకటేశ్వరుఁడిదె నన్నుఁ గూడె నివ్వటిల్ల నెంతలేదు నీవంటివారికి English(||pallavi||) neme dŏrasānulamu neraga lonanuṁdumu sāmuseya nĕṁtaledu samugabuvārigi (||neme||) sigguvaḍa nĕṁtaledu sĕyisām̐sa nĕṁtaledu daggari sevalu sese taruṇulagu vŏggi pilva nĕṁtaledu vobanana nĕṁtaledu aggalamai kāsuga aṁḍanuṁḍevārigi (||neme||) aṁdibŏṁda nĕṁtaledu ānavĕṭṭu nĕṁtaledu kaṁduvanuṁḍeḍi vūḍigabuvārigi sĕṁdigūḍa nĕṁtaledu sĕlliṁchugo nĕṁtaledu yĕṁdugainānŏḍigaṭṭe yiṁṭilonivārigi (||neme||) ravvaseya nĕṁtaledu rachchagĕkka nĕṁtaledu navvulu navviṁche mannanavārigi javvanabu śhrī vĕṁkaḍeśhvarum̐ḍidĕ nannum̐ gūḍĕ nivvaḍilla nĕṁtaledu nīvaṁṭivārigi