Title (Indic)నేఁడు నాభాగ్యమే కాదా నీ చిత్తము వచ్చినది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేఁడు నాభాగ్యమే కాదా నీ చిత్తము వచ్చినది పోఁడిమి నిందుకుఁగానే పొగడేము నిన్నును (॥నేడు॥) యెవ్వతె బుద్ది చెప్పెనో ఇంటికి వచ్చి నాతోను నవ్వి సరసమాడేవు ననుపుగాను రవ్వైతి నన్నులుమని రామచేఁ జెప్పిపంపితి చివ్వన నిన్నుళ్లు వచ్చితివా ఇయ్యెడకు (॥నేడు॥) యేమి దలచుకొంటివో ఇట్టె నన్నొడఁబరచి కామించి చూచేవు నన్నుఁ గాతరానను వేమారు నిన్నా మొన్నా విన్నపాలెల్లాఁ జేసితి ప్రేమాన నిట్లాఁ దొల్లి పెట్టితివా సేస (॥నేడు॥) మనసెట్టు గలిగెనో మమకరించి నీవు యెనసితి విటు నన్ను ఇంతలోననె అనువై శ్రీవేంకటేశ ఆసపడి నేనుండితి తనిసే నందుండే యపుడు తనిసితినా English(||pallavi||) nem̐ḍu nābhāgyame kādā nī sittamu vachchinadi pom̐ḍimi niṁdugum̐gāne pŏgaḍemu ninnunu (||neḍu||) yĕvvadĕ buddi sĕppĕno iṁṭigi vachchi nādonu navvi sarasamāḍevu nanubugānu ravvaidi nannulumani rāmasem̐ jĕppibaṁpidi sivvana ninnuḽlu vachchidivā iyyĕḍagu (||neḍu||) yemi dalasugŏṁṭivo iṭṭĕ nannŏḍam̐barasi kāmiṁchi sūsevu nannum̐ gādarānanu vemāru ninnā mŏnnā vinnabālĕllām̐ jesidi premāna niṭlām̐ dŏlli pĕṭṭidivā sesa (||neḍu||) manasĕṭṭu galigĕno mamagariṁchi nīvu yĕnasidi viḍu nannu iṁtalonanĕ anuvai śhrīveṁkaḍeśha āsabaḍi nenuṁḍidi tanise naṁduṁḍe yabuḍu tanisidinā