Title (Indic)నేఁడాతని సంపదెల్ల నీభాగ్యము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేఁడాతని సంపదెల్ల నీభాగ్యము పోఁడిమితో వలపులు పోగులు వోసీని (॥నేఁడా॥) చలపాదినతమేల సకియతో నవ్వఁగదే చెలువుఁడు మాటలనే సిగ్గురేఁచీని పళువులఁజూపుల నీవు చక్కఁజూడఁగదవే కలసొమ్ములెల్లాను సింగారించుకొనీని (॥నేఁడా॥) మంకుఁదన మింతయేల మాటలైనా నాడఁగదే అంకెల నిన్నాతఁడిట్టె ఆదరించీని బింకపుబీరాలు మాని పెదవి లంచమియ్యనే కంకణము నీ కతఁడు గట్టఁజూచీని (॥నేఁడా॥) పంతము లప్పటినేల పానుపుపైఁ గూచుండవే చెంత శ్రీవేంకటేశుఁడు చేయివట్టీని ఇంతటలమేల్మంగ విన్నిటా మెచ్చవే మంతనపురతులను మక్కళించీని English(||pallavi||) nem̐ḍādani saṁpadĕlla nībhāgyamu pom̐ḍimido valabulu pogulu vosīni (||nem̐ḍā||) salabādinadamela sagiyado navvam̐gade sĕluvum̐ḍu māḍalane siggurem̐sīni paḽuvulam̐jūbula nīvu sakkam̐jūḍam̐gadave kalasŏmmulĕllānu siṁgāriṁchugŏnīni (||nem̐ḍā||) maṁkum̐dana miṁtayela māḍalainā nāḍam̐gade aṁkĕla ninnādam̐ḍiṭṭĕ ādariṁchīni biṁkabubīrālu māni pĕdavi laṁchamiyyane kaṁkaṇamu nī kadam̐ḍu gaṭṭam̐jūsīni (||nem̐ḍā||) paṁtamu lappaḍinela pānububaim̐ gūsuṁḍave sĕṁta śhrīveṁkaḍeśhum̐ḍu seyivaṭṭīni iṁtaḍalamelmaṁga vinniḍā mĕchchave maṁtanaburadulanu makkaḽiṁchīni