Title (Indic)నెలఁత భాగ్యము గాక నీకేమయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నెలఁత భాగ్యము గాక నీకేమయ్య నెలకొక్క వరుసయిన నీకేమయ్యా (॥నెలఁత॥) చెలియఁ గాఁకల ముంచి చిఱునవ్వు నవ్వేవు నెలకొన్న విటుఁడవు నీకేమయ్యా చలిమి దూతికలతో జాణతనా లాడేవు నిలువుఁ గప్పు దొరవు నీకేమయ్యా (॥నెలఁత॥) ప్రేమము చెలియకిచ్చి పిలిచినఁ బలుకవు నేమే కూళల మింతే నీకేమయ్యా బూమెల మాటల నిట్టె పొద్దు గడుపేవు, నీ నేమపుఁ బంతము చెల్లె నీకేమయ్యా (॥నెలఁత॥) మచ్చికమా యలమేలుమంగఁ గౌఁగిలించేవు నిచ్చలు శ్రీవేంకటేశ నీకే మయ్యా అచ్చలపుఁ దత్తరాన నలసిపొలసి నిన్ను నెచ్చెలుల మేమనా నీకేమయ్యా English(||pallavi||) nĕlam̐ta bhāgyamu gāga nīgemayya nĕlagŏkka varusayina nīgemayyā (||nĕlam̐ta||) sĕliyam̐ gām̐kala muṁchi siṟunavvu navvevu nĕlagŏnna viḍum̐ḍavu nīgemayyā salimi dūdigalado jāṇadanā lāḍevu niluvum̐ gappu dŏravu nīgemayyā (||nĕlam̐ta||) premamu sĕliyagichchi pilisinam̐ balugavu neme kūḽala miṁte nīgemayyā būmĕla māḍala niṭṭĕ pŏddu gaḍubevu, nī nemabum̐ baṁtamu sĕllĕ nīgemayyā (||nĕlam̐ta||) machchigamā yalamelumaṁgam̐ gaum̐giliṁchevu nichchalu śhrīveṁkaḍeśha nīge mayyā achchalabum̐ dattarāna nalasibŏlasi ninnu nĕchchĕlula memanā nīgemayyā