Title (Indic)నీవు చేసినపనులు నీకే చెల్లెఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవు చేసినపనులు నీకే చెల్లెఁ గాక యీవల నింతేసి చేయ నెవ్వరికీఁ జెల్లదు (॥నీవు॥) దొడ్డ లేల బ్రహ్మండము తూఁటవోఁ బొడిచితివి సడ్డసేయ కొత్తితివి సముద్రమును అడ్డము లే దంటాను హరివిల్లు విఱిచితివి వొడ్డారాలే నీ కతలు వొద్దనే వా రెవ్వరు (॥నీవు॥) నీరు చట్టు చేసితివి నీవే నీ యాజ్ఞ మీఱి ధారుణి చక్రవాళము దాఁటితివి ఆరయ లోకములు మూఁ డడుగులు సేసితివి దూరులే యివెల్లా నీసుద్దులు చెప్పేనేఁటికి (॥నీవు॥) నిక్కిన కులగిరులు నేలమట్టు చేసితివి పక్కనఁ దెచ్చితి వింద్రుపారిజాతము గుక్కక శ్రీవేంకటేశ గొల్లెతలఁ గైకొంటివి వెక్కసపు నీ వోజలు విచారించవైతివి English(||pallavi||) nīvu sesinabanulu nīge sĕllĕm̐ gāga yīvala niṁtesi seya nĕvvarigīm̐ jĕlladu (||nīvu||) dŏḍḍa lela brahmaṁḍamu tūm̐ṭavom̐ bŏḍisidivi saḍḍaseya kŏttidivi samudramunu aḍḍamu le daṁṭānu harivillu viṟisidivi vŏḍḍārāle nī kadalu vŏddane vā rĕvvaru (||nīvu||) nīru saṭṭu sesidivi nīve nī yājña mīṟi dhāruṇi sakravāḽamu dām̐ṭidivi āraya logamulu mūm̐ ḍaḍugulu sesidivi dūrule yivĕllā nīsuddulu sĕppenem̐ṭigi (||nīvu||) nikkina kulagirulu nelamaṭṭu sesidivi pakkanam̐ dĕchchidi viṁdrubārijādamu gukkaga śhrīveṁkaḍeśha gŏllĕdalam̐ gaigŏṁṭivi vĕkkasabu nī vojalu visāriṁchavaidivi