Title (Indic)నీవెంత లెస్సవుండినా నేఁడది నా లాబము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవెంత లెస్సవుండినా నేఁడది నా లాబము యీవల నొకటొకటే యెచ్చరించే నేను (॥నీవెం॥) సొలసి యీపె నిన్నుఁజూచినమర్మపుఁజూపు నలిరేఁగి నీమనసు నాఁటి కొనెనా చెలులచే నెడనెడఁ జెప్పిపంపిన మాటలు తలఁచుకొంటివా నీవు తనివారను (॥నీవెం॥) అల్లంత నుండి నీకు నాపె సేసినసన్నలు తెల్లమిగా నీలోనఁ దెలిసితివా వొల్లనే నీచేతి కాపెవొసగినబాగాలు చల్లఁగా నీపుక్కిటిచవులాయనా (॥నీవెం॥) ముచ్చటతో నాపె నీకు మొక్కినకేలిమొక్కులు అచ్చముగ నీకు సెలవాయనా నేఁడు ఇచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె మెచ్చి యాపెపొందు నీవు మెయికొంటివా English(||pallavi||) nīvĕṁta lĕssavuṁḍinā nem̐ḍadi nā lābamu yīvala nŏgaḍŏgaḍe yĕchchariṁche nenu (||nīvĕṁ||) sŏlasi yībĕ ninnum̐jūsinamarmabum̐jūbu nalirem̐gi nīmanasu nām̐ṭi kŏnĕnā sĕlulase nĕḍanĕḍam̐ jĕppibaṁpina māḍalu talam̐sugŏṁṭivā nīvu tanivāranu (||nīvĕṁ||) allaṁta nuṁḍi nīgu nābĕ sesinasannalu tĕllamigā nīlonam̐ dĕlisidivā vŏllane nīsedi kābĕvŏsaginabāgālu sallam̐gā nībukkiḍisavulāyanā (||nīvĕṁ||) muchchaḍado nābĕ nīgu mŏkkinagelimŏkkulu achchamuga nīgu sĕlavāyanā nem̐ḍu ichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ mĕchchi yābĕbŏṁdu nīvu mĕyigŏṁṭivā