Title (Indic)నీవేల దాఁచేవు నీకెంత సంపదైనాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవేల దాఁచేవు నీకెంత సంపదైనాను సోవలుగాఁ గన్నులారఁ జూచేము గాక (॥॥) పోద్దుననే వచ్చి యాపె పొందులెల్లఁ జెప్పుఁగాను గద్దించి యేలసేసేవు కనుసన్నలు వొద్దనేమా నేము నిన్ను వూరల్లాఁ జూట్టాలైతే వొద్దికతో వలపులు వుట్టిఁ బట్టవచ్చును (॥॥) కొలువులో దెచ్చి నీగురుతు లాపె చూపఁ గా కెలన నీగోరనేల గీఁటుకొనేవు మలసి నిన్ను దూరెదమా మనసు నీ కందుండితే కలగూరవేడుకలు గంపఁ బెట్టవచ్చును (॥॥) తఱితోడ నాపె నీపాదములకు మొక్కఁ గా చిఱునవ్నేల దాఁచేవు శ్రీ వేంకటేశ యెఱఁగమా నీవావులు యే నలమేలుమంగను గుఱిగాఁ గూడితి నేర్పు గూఁటఁ బెట్టవచ్చును English(||pallavi||) nīvela dām̐sevu nīgĕṁta saṁpadainānu sovalugām̐ gannulāram̐ jūsemu gāga (||||) poddunane vachchi yābĕ pŏṁdulĕllam̐ jĕppum̐gānu gaddiṁchi yelasesevu kanusannalu vŏddanemā nemu ninnu vūrallām̐ jūṭṭālaide vŏddigado valabulu vuṭṭim̐ baṭṭavachchunu (||||) kŏluvulo dĕchchi nīgurudu lābĕ sūbam̐ gā kĕlana nīgoranela gīm̐ṭugŏnevu malasi ninnu dūrĕdamā manasu nī kaṁduṁḍide kalagūraveḍugalu gaṁpam̐ bĕṭṭavachchunu (||||) taṟidoḍa nābĕ nībādamulagu mŏkkam̐ gā siṟunavnela dām̐sevu śhrī veṁkaḍeśha yĕṟam̐gamā nīvāvulu ye nalamelumaṁganu guṟigām̐ gūḍidi nerbu gūm̐ṭam̐ bĕṭṭavachchunu