Title (Indic)నీవేళ భ్రమసేవు నే నుందాన నిడి(ది?)వో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవేళ భ్రమసేవు నే నుందాన నిడి(ది?)వో సేవసేసేఁగాని యిట్టె సేయించుకోరాదా (॥నీవే॥) కప్పురవిడె మింద కస్తూరివుండ లివిగొ దప్పిదేర్చుకో కొంత దగదొట్టకు కొప్పు చక్కఁబెట్టుకో గోణము చక్కఁగట్టుకో అప్పటి మేను గిజిగిజియై వుందురా (॥నీవే॥) చల్లనిగందవో డిదే సారపుఁబన్నీ రిదే చల్లుకోరాదా మేని సరతువాసు వల్లెవాటు వేసుకో వద్దవచ్చి కూచుండు బల్లిదుఁడవై వుండి పాఁచి సింగారాలేల (॥నీవే॥) చాయపట్టుపర పదె సకినలమంచ మిదె యీయెడనే పవళించు ఇఁక లోఁగకు పాయపుశ్రీవేంకటేశ పచ్చిగాఁ గూడితి దాయదండై వుండు మేల తడఁబడ నిపుడు English(||pallavi||) nīveḽa bhramasevu ne nuṁdāna niḍi(di?)vo sevasesem̐gāni yiṭṭĕ seyiṁchugorādā (||nīve||) kappuraviḍĕ miṁda kastūrivuṁḍa livigŏ dappidersugo kŏṁta dagadŏṭṭagu kŏppu sakkam̐bĕṭṭugo goṇamu sakkam̐gaṭṭugo appaḍi menu gijigijiyai vuṁdurā (||nīve||) sallanigaṁdavo ḍide sārabum̐bannī ride sallugorādā meni saraduvāsu vallĕvāḍu vesugo vaddavachchi kūsuṁḍu ballidum̐ḍavai vuṁḍi pām̐si siṁgārālela (||nīve||) sāyabaṭṭubara padĕ saginalamaṁcha midĕ yīyĕḍane pavaḽiṁchu im̐ka lom̐gagu pāyabuśhrīveṁkaḍeśha pachchigām̐ gūḍidi dāyadaṁḍai vuṁḍu mela taḍam̐baḍa nibuḍu