Title (Indic)నీవేడుకే చూచేవు నెలఁత లాగెంచవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవేడుకే చూచేవు నెలఁత లాగెంచవు సోవలకన్నుల నాపె సొలయఁగాను (॥నీవే॥) యెందాఁకా మాటలాడేవు యెంతలేదు నీనవ్వు అందపుటాసలఁ జెలి అలయఁగాను యిందునందూ సోలుతా నెమ్మె లేమిచూపేవు గొంది నుండి యాపె నిన్నుఁ గొసరఁగాను (॥నీవే॥) యేమి సరసమాడేవు యేదిగొద్ది నీపగటు కామిని కాఁకలచేతఁ గసుగందగా సాములు సేయుచును చలమేల సాదించేవు వేమరు నాపె నిన్ను వేఁడుకొనఁగాను (॥నీవే॥) యెట్టు వేసాలు సేసేవు ఇన్నియు నేర్తువు నీవు అట్టె ఇంతి నిన్నుఁగూడి అలయఁగాను రట్టుగ శ్రీవేంకటేశ ముట్టి యేల కెలసేవు వెట్టదీర నాపె నిన్ను వినుతించఁగాను English(||pallavi||) nīveḍuge sūsevu nĕlam̐ta lāgĕṁchavu sovalagannula nābĕ sŏlayam̐gānu (||nīve||) yĕṁdām̐kā māḍalāḍevu yĕṁtaledu nīnavvu aṁdabuḍāsalam̐ jĕli alayam̐gānu yiṁdunaṁdū soludā nĕmmĕ lemisūbevu gŏṁdi nuṁḍi yābĕ ninnum̐ gŏsaram̐gānu (||nīve||) yemi sarasamāḍevu yedigŏddi nībagaḍu kāmini kām̐kalasedam̐ gasugaṁdagā sāmulu seyusunu salamela sādiṁchevu vemaru nābĕ ninnu vem̐ḍugŏnam̐gānu (||nīve||) yĕṭṭu vesālu sesevu inniyu nerduvu nīvu aṭṭĕ iṁti ninnum̐gūḍi alayam̐gānu raṭṭuga śhrīveṁkaḍeśha muṭṭi yela kĕlasevu vĕṭṭadīra nābĕ ninnu vinudiṁcham̐gānu