Title (Indic)నీవే విచ్చేసి చూడు నెలఁత భావములెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవే విచ్చేసి చూడు నెలఁత భావములెల్లా భావించఁగలమా అయ్య పడఁతి లోవలపు (॥నీవే॥) తలపోఁతలనె కొంత తమకములనె కొంత మలసి పొద్దుజరపె మగువ అలసేయతంటిలోనె అతివమీఁద నొరగె బలిమి నింతటిమీఁద పట్టిరాదు వలపు (॥నీవె॥) యెడమాటలనె కొంత యెదురుచూపులఁ గొంత అడరి ధీరత నుండె అతివ జడిసి పానుపుమీఁద చల్లఁగాఁ బవ్వళించె విడువక ఇఁక విన్నవించరాదు వలపు (॥నీవె॥) నీపై పాటలఁ గొంత నిక్కలలనే కొంత తీపులఁ గాచుకుండెను తెఱవ యేపున శ్రీవేంకటేశ యింతలో నీపెఁ గూడితి యేపొద్దూ దనివిలేదు యేమిటాను వలపు English(||pallavi||) nīve vichchesi sūḍu nĕlam̐ta bhāvamulĕllā bhāviṁcham̐galamā ayya paḍam̐ti lovalabu (||nīve||) talabom̐talanĕ kŏṁta tamagamulanĕ kŏṁta malasi pŏddujarabĕ maguva alaseyadaṁṭilonĕ adivamīm̐da nŏragĕ balimi niṁtaḍimīm̐da paṭṭirādu valabu (||nīvĕ||) yĕḍamāḍalanĕ kŏṁta yĕdurusūbulam̐ gŏṁta aḍari dhīrada nuṁḍĕ adiva jaḍisi pānubumīm̐da sallam̐gām̐ bavvaḽiṁchĕ viḍuvaga im̐ka vinnaviṁcharādu valabu (||nīvĕ||) nībai pāḍalam̐ gŏṁta nikkalalane kŏṁta tībulam̐ gāsuguṁḍĕnu tĕṟava yebuna śhrīveṁkaḍeśha yiṁtalo nībĕm̐ gūḍidi yebŏddū daniviledu yemiḍānu valabu