Title (Indic)నీవే పాడిపంతాలకు నేరుపరివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవే పాడిపంతాలకు నేరుపరివి కైవసము చేసుకొని కలపే విద్దరిని (॥॥) మొగము చూచి చూచి మోవిలంచా లొడఁ బడి తగవులుదిద్దేవు తరుణులకు బిగిసి నీ విక్కువ చెప్పించుకొని వొండొరుల జగడాలు దీర్చి తీర్చి సంతసముచేసేవు (॥॥) పొంచి చనుజక్కవల పొందులపూఁటలు గొని కంచముపొత్తు సేసేవు కాంతలను మంచముపై నెక్కించుక మరి తారిఁ దమికించి అంచెల నొక్కటిచేసి ఆదరించేవు (॥॥) వేడుకనవ్వులు నవ్వి విడే లిప్పించుకొని జోడుగాఁ గాఁగిటఁ గూడి చొక్కించేవు వోడక శ్రీ వేంకటేశ వురమున వీఁపునను చేడెల నిలుపుకొని చెలుములు సేసేవు English(||pallavi||) nīve pāḍibaṁtālagu nerubarivi kaivasamu sesugŏni kalabe viddarini (||||) mŏgamu sūsi sūsi movilaṁchā lŏḍam̐ baḍi tagavuludiddevu taruṇulagu bigisi nī vikkuva sĕppiṁchugŏni vŏṁḍŏrula jagaḍālu dīrsi tīrsi saṁtasamusesevu (||||) pŏṁchi sanujakkavala pŏṁdulabūm̐ṭalu gŏni kaṁchamubŏttu sesevu kāṁtalanu maṁchamubai nĕkkiṁchuga mari tārim̐ damigiṁchi aṁchĕla nŏkkaḍisesi ādariṁchevu (||||) veḍuganavvulu navvi viḍe lippiṁchugŏni joḍugām̐ gām̐giḍam̐ gūḍi sŏkkiṁchevu voḍaga śhrī veṁkaḍeśha vuramuna vīm̐punanu seḍĕla nilubugŏni sĕlumulu sesevu