Title (Indic)నీవే బోధించి నన్ను నీవే యీడేర్తు గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవే బోధించి నన్ను నీవే యీడేర్తు గాక నా వంక నేమి గలరు నమో నారాయణా (॥నీవే॥) పంచిన నా కర్మములు పనులే బోధించుఁ గాక పొంచిన శ్రీహరి నిన్ను బోధించీనా తెంచరాని ఆసలివి తిమ్మటే బోధించుఁ గాక కంచపు నీ దివ్యనామ కతలు బోధించీనా (॥నీవే॥) పొరలు యింద్రియములు భోగమే భోధించుఁ గాక పురుషోత్తముఁడ నిన్ను బోధీంచీనా సరుస నా యాకలిది చవులే బోదించుఁ గాక నిరతి నీ కైంకర్యము నేఁడు బోధించీనా (॥నీవే॥) గాసిల్ల నామతి యహంకారమే భోధించుఁ గాక భూసతీశ నిన్నుఁ గాన బోధించీనా యీసుదీర శ్రీ వేంకటేశ నీకు నా గురుఁడు దాసి బోధించుఁ గాక తప్పఁగా బోధించునా English(||pallavi||) nīve bodhiṁchi nannu nīve yīḍerdu gāga nā vaṁka nemi galaru namo nārāyaṇā (||nīve||) paṁchina nā karmamulu panule bodhiṁchum̐ gāga pŏṁchina śhrīhari ninnu bodhiṁchīnā tĕṁcharāni āsalivi timmaḍe bodhiṁchum̐ gāga kaṁchabu nī divyanāma kadalu bodhiṁchīnā (||nīve||) pŏralu yiṁdriyamulu bhogame bhodhiṁchum̐ gāga puruṣhottamum̐ḍa ninnu bodhīṁchīnā sarusa nā yāgalidi savule bodiṁchum̐ gāga niradi nī kaiṁkaryamu nem̐ḍu bodhiṁchīnā (||nīve||) gāsilla nāmadi yahaṁkārame bhodhiṁchum̐ gāga bhūsadīśha ninnum̐ gāna bodhiṁchīnā yīsudīra śhrī veṁkaḍeśha nīgu nā gurum̐ḍu dāsi bodhiṁchum̐ gāga tappam̐gā bodhiṁchunā