Title (Indic)నీవంక నేరమేదే నిజమెంచి చూచితేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవంక నేరమేదే నిజమెంచి చూచితేను పూవుల మొగ్గలే కావా పూఁపలకు మొదలు (॥నీ వంక॥) పడఁతిరో నీ వదేమే పట్టాడే వాతనికిఁగా యెడమాట లాడఁబోయి యెనసితివా నడుమ విందారగించే నాలిక యటుండఁగాను తొడికే చేయేకాదా తొలుతఁ బైకొనును (॥నీ వంక॥) మానిని అదేమే వాని మంకులు చెల్లఁబెట్టేవు కానుక లియ్యఁగఁబోఇ కలసితివా మానలేక వలచిన మనసట్టే వుండఁగాను కోనల చూపులే కావా గురి గాఁడి పారును (॥నీ వంక॥) శ్రీ వేంకటేశ్వరు నన్నుఁ జేకొని కూడించితివి నీ వొళ్లికడమ నిండ నెలకొంటివా కైవశపు మేనికిని కాఁగిలి యటుండఁగాను రావాడే చన్నులే కావా రతికెక్కు నడుమ English(||pallavi||) nīvaṁka neramede nijamĕṁchi sūsidenu pūvula mŏggale kāvā pūm̐palagu mŏdalu (||nī vaṁka||) paḍam̐tiro nī vademe paṭṭāḍe vādanigim̐gā yĕḍamāḍa lāḍam̐boyi yĕnasidivā naḍuma viṁdāragiṁche nāliga yaḍuṁḍam̐gānu tŏḍige seyegādā tŏludam̐ baigŏnunu (||nī vaṁka||) mānini ademe vāni maṁkulu sĕllam̐bĕṭṭevu kānuga liyyam̐gam̐boi kalasidivā mānalega valasina manasaṭṭe vuṁḍam̐gānu konala sūbule kāvā guri gām̐ḍi pārunu (||nī vaṁka||) śhrī veṁkaḍeśhvaru nannum̐ jegŏni kūḍiṁchidivi nī vŏḽligaḍama niṁḍa nĕlagŏṁṭivā kaivaśhabu menigini kām̐gili yaḍuṁḍam̐gānu rāvāḍe sannule kāvā radigĕkku naḍuma