Title (Indic)నీచిత్తము నాభాగ్యము నీవెట్టయినాఁ జేయి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీచిత్తము నాభాగ్యము నీవెట్టయినాఁ జేయి కాచుకున్నదాన నీకుఁ గరుణించు మిఁకను (॥నీచి॥) మనసురాని యట్టిమాట లెన్నియాడినాను పనిమాలుటేకాని బాఁతి గావు తనివిలేనియట్టితమక మెంతవెంచినా పెనఁగులాటకునుఁబెట్ట కేల మానును (॥నీచి॥) సెలవుగానియట్టిచేఁత లెన్ని సేసినాను ఆలమటలేకాని యందము గావు వలవనికోరికలు వాములెంత వేసుకొన్నా తలకొన్న వలపులు తనియనేలిచ్చును (॥నీచి॥) ఆయముసోఁకనినవ్వు లవి యెంతనవ్వినాను కాయకములేకాని కళ దాఁకదు పాయపుటలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడ యీయెడ నన్నేలితివి యిఁక నిన్ను మెత్తును English(||pallavi||) nīsittamu nābhāgyamu nīvĕṭṭayinām̐ jeyi kāsugunnadāna nīgum̐ garuṇiṁchu mim̐kanu (||nīsi||) manasurāni yaṭṭimāḍa lĕnniyāḍinānu panimāluḍegāni bām̐ti gāvu tanivileniyaṭṭidamaga mĕṁtavĕṁchinā pĕnam̐gulāḍagunum̐bĕṭṭa kela mānunu (||nīsi||) sĕlavugāniyaṭṭisem̐ta lĕnni sesinānu ālamaḍalegāni yaṁdamu gāvu valavanigorigalu vāmulĕṁta vesugŏnnā talagŏnna valabulu taniyanelichchunu (||nīsi||) āyamusom̐kaninavvu lavi yĕṁtanavvinānu kāyagamulegāni kaḽa dām̐kadu pāyabuḍalamelmaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍa yīyĕḍa nannelidivi yim̐ka ninnu mĕttunu