Title (Indic)నీకుఁ బోదు నాకుఁ బోదు నీ వెట్టు సేసినాఁ జేయి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీకుఁ బోదు నాకుఁ బోదు నీ వెట్టు సేసినాఁ జేయి సాకిరివంటిది నా జవ్వన మిందుకును (॥నీకు॥) జిగురువంటిది నాచిత్త మిది నీమీఁదఁ దగిలి విడువరు నీ తగురూపు తగరువంటిది నాతమకము మీఁద మీఁద నతడు నేయు నీయాయాలు దాఁకీని (॥నీకు॥) బచ్చనవంటిది నాపలుకు నీయడకును అచ్చమై చూడఁ జూడఁగ నంద మై యుండు నిచ్చనలవంటివి నానిండుఁ గోరికలు నీకు హెచ్చినవలపు తల కెక్కఁ జేసేయెందుకు (॥నీకు॥) గాలమువంటిది నాకాఁగిటికూటమి నీకు తూలి మరి యెందుకునుఁ దొలఁగ రాదు తాలమువంటిది నాతగులమి నీమీఁద మేలిమి శ్రీవెంకటేశ మీఁదఁ గిందఁ బాయదూ English(||pallavi||) nīgum̐ bodu nāgum̐ bodu nī vĕṭṭu sesinām̐ jeyi sāgirivaṁṭidi nā javvana miṁdugunu (||nīgu||) jiguruvaṁṭidi nāsitta midi nīmīm̐dam̐ dagili viḍuvaru nī tagurūbu tagaruvaṁṭidi nādamagamu mīm̐da mīm̐da nadaḍu neyu nīyāyālu dām̐kīni (||nīgu||) bachchanavaṁṭidi nābalugu nīyaḍagunu achchamai sūḍam̐ jūḍam̐ga naṁda mai yuṁḍu nichchanalavaṁṭivi nāniṁḍum̐ gorigalu nīgu hĕchchinavalabu tala kĕkkam̐ jeseyĕṁdugu (||nīgu||) gālamuvaṁṭidi nāgām̐giḍigūḍami nīgu tūli mari yĕṁdugunum̐ dŏlam̐ga rādu tālamuvaṁṭidi nādagulami nīmīm̐da melimi śhrīvĕṁkaḍeśha mīm̐dam̐ giṁdam̐ bāyadū