Title (Indic)నీకే సెలవని నెపమువేయుట యింతే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీకే సెలవని నెపమువేయుట యింతే కైకొని కాచే నీ వుపకారమే దక్కినది (॥నీకే॥) వొట్టి నీ కొఱకుఁగా వుపవాసా లుండేనంటే అట్టె నీకు లాభము అం దేమున్నది జట్టిగా నిన్నుఁ గూరిచి సన్యాసి నయ్యే నంటే చుట్టుకొని నీకు గల్గే సుఖమం దేమున్నది (॥నీకే॥) కడు నీ పాదతీర్థపు గంగలో నానే నంటే అడరిన తనివి నీ కందేమున్నది అడవిలో ఘోరతప మంది నీకుఁ జేసే నంటే అడియాలమైన ఫల మందు నీ కేమున్నది (॥నీకే॥) నిన్నుఁ గనుఁగొన్నదాఁకానే గడ్డము వెంచే నంటే అన్నిటా నీకుఁ గూడేది అందేమున్నది వున్నతి శ్రీవేంకటేశ వూరకే నీ వాఁడ నైతి యెన్న నీకుఁ గాక యిఁక నం దేమున్నది English(||pallavi||) nīge sĕlavani nĕbamuveyuḍa yiṁte kaigŏni kāse nī vubagārame dakkinadi (||nīge||) vŏṭṭi nī kŏṟagum̐gā vubavāsā luṁḍenaṁṭe aṭṭĕ nīgu lābhamu aṁ demunnadi jaṭṭigā ninnum̐ gūrisi sanyāsi nayye naṁṭe suṭṭugŏni nīgu galge sukhamaṁ demunnadi (||nīge||) kaḍu nī pādadīrdhabu gaṁgalo nāne naṁṭe aḍarina tanivi nī kaṁdemunnadi aḍavilo ghoradaba maṁdi nīgum̐ jese naṁṭe aḍiyālamaina phala maṁdu nī kemunnadi (||nīge||) ninnum̐ ganum̐gŏnnadām̐kāne gaḍḍamu vĕṁche naṁṭe anniḍā nīgum̐ gūḍedi aṁdemunnadi vunnadi śhrīveṁkaḍeśha vūrage nī vām̐ḍa naidi yĕnna nīgum̐ gāga yim̐ka naṁ demunnadi