Title (Indic)నీతోడి విరహానను నెలఁతమై నిన్నియును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీతోడి విరహానను నెలఁతమై నిన్నియును కాతరించి బెదరీ సంగతి సేయవయ్యా (॥నీతో॥) కందువలఁ బొదివి జక్కవలను దువ్వుదువు ముందు ముందె తుమ్మిదల మూఁక గూర్తువు విందుగా చకోరాలకు వెన్నెలలావటింతువు యిందుముఖి పిలిచీని యిట్టె రావయ్యా (॥నీతో॥) కలయ మాటాడి చిలుకలఁ బలికింతువు పలుమారుఁ గోవిలలఁ బాడింతువు అలర ముంగిటను రాయంచలనాడింతువు యెలమినంగన విల్చీ నిట్టె రావయ్యా (॥నీతో॥) నెయ్యము మీఱఁగ తేనియ పెరరేఁతువు చెయ్యంటి మయూరముఁ జెలఁగింతువు వొయ్యనె శ్రీ వేంకటేశ వొనగూడితివింతలో యియ్యెడఁ గామిని విల్చీ నిట్టె రావయ్యా English(||pallavi||) nīdoḍi virahānanu nĕlam̐tamai ninniyunu kādariṁchi bĕdarī saṁgadi seyavayyā (||nīdo||) kaṁduvalam̐ bŏdivi jakkavalanu duvvuduvu muṁdu muṁdĕ tummidala mūm̐ka gūrduvu viṁdugā sagorālagu vĕnnĕlalāvaḍiṁtuvu yiṁdumukhi pilisīni yiṭṭĕ rāvayyā (||nīdo||) kalaya māḍāḍi silugalam̐ baligiṁtuvu palumārum̐ govilalam̐ bāḍiṁtuvu alara muṁgiḍanu rāyaṁchalanāḍiṁtuvu yĕlaminaṁgana vilsī niṭṭĕ rāvayyā (||nīdo||) nĕyyamu mīṟam̐ga teniya pĕrarem̐tuvu sĕyyaṁṭi mayūramum̐ jĕlam̐giṁtuvu vŏyyanĕ śhrī veṁkaḍeśha vŏnagūḍidiviṁtalo yiyyĕḍam̐ gāmini vilsī niṭṭĕ rāvayyā