Title (Indic)నీతి విచారించుకోవే నీలో నీవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీతి విచారించుకోవే నీలో నీవే కాతరించి దూరుదురా కలికిరో నీవు (॥॥) సారె బతిసముకాన సతులతో నవ్వఁగాను వూరకే వండుదురా వొద్దివారెల్లా కోరి నీ వందుకుఁగాను కొడిమెలు గట్టేవు ఆరజకతైవుగదే అంగనరో నీవు (॥॥) గద్దెమీఁదనుండాతడు కప్పురము లియ్యఁగాను గద్దించి వొల్లమందురా కామినులెల్లా వద్దనుండి ఇందుకుఁగా వావు లేరుపరచేవు సుద్దులకత్తెవుగదే సుదతిరో నీవు (॥॥) శ్రీ వేంకటేశుఁడు మెచ్చి చేరి కాఁగిలించఁ గాను దేవుళ్ళఁ గామందురా పొందినవారెల్లా నీవుఁ గూడి యిందుకుఁ గా నిండుఁజుట్టాలఁ జేసేవు వోవలకతైవుగదే వువిదరో నీవు English(||pallavi||) nīdi visāriṁchugove nīlo nīve kādariṁchi dūrudurā kaligiro nīvu (||||) sārĕ badisamugāna sadulado navvam̐gānu vūrage vaṁḍudurā vŏddivārĕllā kori nī vaṁdugum̐gānu kŏḍimĕlu gaṭṭevu ārajagadaivugade aṁganaro nīvu (||||) gaddĕmīm̐danuṁḍādaḍu kappuramu liyyam̐gānu gaddiṁchi vŏllamaṁdurā kāminulĕllā vaddanuṁḍi iṁdugum̐gā vāvu lerubarasevu suddulagattĕvugade sudadiro nīvu (||||) śhrī veṁkaḍeśhum̐ḍu mĕchchi seri kām̐giliṁcham̐ gānu devuḽḽam̐ gāmaṁdurā pŏṁdinavārĕllā nīvum̐ gūḍi yiṁdugum̐ gā niṁḍum̐juṭṭālam̐ jesevu vovalagadaivugade vuvidaro nīvu