Title (Indic)నీట ముంచు పాల ముంచు నీచిత్త మిఁకను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీట ముంచు పాల ముంచు నీచిత్త మిఁకను యీటగు నీ పతిభావ మిది గలది (॥నీట॥) తప్పక చూచుఁ జూచు తలవంచు నంతలోనె వుప్పతిల్లఁ బులకించు నుస్సురనును కప్పురగంధి నీవుఁ గదిసి కూడిన కాఁక చెప్పరాదు విరహము చెంతల నీపతికి (॥నీట॥) చిన్నఁబోవు నంతలోనె చెలులపైఁ గోపగించు కన్నచో వెదకు మేనఁ గప్పు కప్పును కన్నెరొ విభఁడు నీవు కళ లంటినదాఁక మిన్నక చింతాజలధి మీరరాదో యమ్మ (॥నీట॥) బుద్దు లెంచుకొను లోలో పోసరించి కల్లపడు అద్దివొ శ్రీవెంకటేశుఁ డాడ నాడనె వొద్దికై నీ విటువలె వొనగూడి వుండుదాఁక చద్దికి వేఁడికి వెదచల్లు లాయ వలపు English(||pallavi||) nīḍa muṁchu pāla muṁchu nīsitta mim̐kanu yīḍagu nī padibhāva midi galadi (||nīḍa||) tappaga sūsum̐ jūsu talavaṁchu naṁtalonĕ vuppadillam̐ bulagiṁchu nussuranunu kappuragaṁdhi nīvum̐ gadisi kūḍina kām̐ka sĕpparādu virahamu sĕṁtala nībadigi (||nīḍa||) sinnam̐bovu naṁtalonĕ sĕlulabaim̐ gobagiṁchu kannaso vĕdagu menam̐ gappu kappunu kannĕrŏ vibham̐ḍu nīvu kaḽa laṁṭinadām̐ka minnaga siṁtājaladhi mīrarādo yamma (||nīḍa||) buddu lĕṁchugŏnu lolo posariṁchi kallabaḍu addivŏ śhrīvĕṁkaḍeśhum̐ ḍāḍa nāḍanĕ vŏddigai nī viḍuvalĕ vŏnagūḍi vuṁḍudām̐ka saddigi vem̐ḍigi vĕdasallu lāya valabu