Title (Indic)నీ విభుఁడు వచ్చుదాఁక నిచ్చలాన నుండే(డ?)వే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ విభుఁడు వచ్చుదాఁక నిచ్చలాన నుండే(డ?)వే వేవేలకును రేయి వేగించలేమే (॥నీవి॥) పూయకు కస్తూరి మేనఁ బొద్దుగూఁకెఁ జీఁకటంటా నోయమ్మ చందురుఁడుదయించెను చాయల వెన్నెలదాఁకి చల్లజంపు యెండలంటా ఆయెడ నీవు వేఁగఁగ నదిచూడలేమే (॥నీవి॥) గందము పుయ్యకువే కలికి నీకుచములే చందనపుఁ గొండలంటాఁ జల్లీ గాలి అందులో పూవుతావి దాఁకి అమ్ముమొనలంటెనంటా మందమై మేనుమరవఁగ మందులుదేలేమే (॥నీవి॥) వద్దేలే కుంకుమలు వసంతపుఁ జిగురంటా నద్దితేఁ గోవిల భూతమని లోఁగేవు నిద్దపు శ్రీ వెంకటాద్రినిలయుఁడిట్టె కూడె యిద్దరి మీవలపులు యింక నెంచలేమే English(||pallavi||) nī vibhum̐ḍu vachchudām̐ka nichchalāna nuṁḍe(ḍa?)ve vevelagunu reyi vegiṁchaleme (||nīvi||) pūyagu kastūri menam̐ bŏddugūm̐kĕm̐ jīm̐kaḍaṁṭā noyamma saṁdurum̐ḍudayiṁchĕnu sāyala vĕnnĕladām̐ki sallajaṁpu yĕṁḍalaṁṭā āyĕḍa nīvu vem̐gam̐ga nadisūḍaleme (||nīvi||) gaṁdamu puyyaguve kaligi nīgusamule saṁdanabum̐ gŏṁḍalaṁṭām̐ jallī gāli aṁdulo pūvudāvi dām̐ki ammumŏnalaṁṭĕnaṁṭā maṁdamai menumaravam̐ga maṁduludeleme (||nīvi||) vaddele kuṁkumalu vasaṁtabum̐ jiguraṁṭā naddidem̐ govila bhūdamani lom̐gevu niddabu śhrī vĕṁkaḍādrinilayum̐ḍiṭṭĕ kūḍĕ yiddari mīvalabulu yiṁka nĕṁchaleme