Title (Indic)నీ వెప్పుడూ ఘనుఁడవే నే నీచేతిలోదానను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ వెప్పుడూ ఘనుఁడవే నే నీచేతిలోదానను యేవేళ నెట్లున్నా నేమాయ నీకు (॥నీవె॥) వన్నెల నన్నింత నీవు వలపించిన వాఁడవు కన్నుల నాచూపులకుఁ గాచుకుందువు పన్ని తాము చేసే పైరుపంట కెదురుచూడరా యెన్ని సేసిన నాయెడ కేమాయ నీకు (॥నీవె॥) తలఁపెల్ల నీ వన్నీటా దక్కఁగొన్నట్టివాఁడవు పలుకులు నావెల్లాఁ బాలింతువు మలసి తమచిలుకమాటలు ముద్దు సేయరా యెలమి నాకొరకుఁగా నేమాయ నీకు (॥నీవె॥) కందువ నారతులను కలసినట్టివాఁడవు మందెమేళములు నావి మన్నింతువు విందారగించేటివారు వేడఁయిన నోర్వరా యిందులో శ్రీ వేంకటేశ యేమాయ నీకు English(||pallavi||) nī vĕppuḍū ghanum̐ḍave ne nīsedilodānanu yeveḽa nĕṭlunnā nemāya nīgu (||nīvĕ||) vannĕla nanniṁta nīvu valabiṁchina vām̐ḍavu kannula nāsūbulagum̐ gāsuguṁduvu panni tāmu sese pairubaṁṭa kĕdurusūḍarā yĕnni sesina nāyĕḍa kemāya nīgu (||nīvĕ||) talam̐pĕlla nī vannīḍā dakkam̐gŏnnaṭṭivām̐ḍavu palugulu nāvĕllām̐ bāliṁtuvu malasi tamasilugamāḍalu muddu seyarā yĕlami nāgŏragum̐gā nemāya nīgu (||nīvĕ||) kaṁduva nāradulanu kalasinaṭṭivām̐ḍavu maṁdĕmeḽamulu nāvi manniṁtuvu viṁdāragiṁcheḍivāru veḍam̐yina norvarā yiṁdulo śhrī veṁkaḍeśha yemāya nīgu