Title (Indic)నీ వేమి సేసినాను నీకుఁ జెల్లును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ వేమి సేసినాను నీకుఁ జెల్లును వెూపులు గిరుపనేల వెూహించినదానికి (॥॥) చెలఁగి పతి ముట్టితే చేతికి లోనౌటగాక చలపాదితమేల జవరాలికి పిలిచి పేరుకొంటే బెరసి వూఁకొంటగాక వలననిబిగువేల వలచినదానికి (॥॥) వొగ్గి విడెమిచ్చితేను వొడి నించుకొంటగాక సిగ్గులు వడఁగనేల చిన్నదానికి దిగ్గన సరసమాడితేఁ జెనకుట గాక యెగ్గులుపట్టఁగనేల యిచ్చకపుదానికి (॥॥) చనుఁగవ లంటితేను సమ్మతించుకొంట గాక పెనఁగులాడఁగనేల ప్రియురాలికి యెనసితివి శ్రీ వేంకటేశ యింతలో నన్ను తనిసితిఁ గొంకనేల తమకపుదానికి English(||pallavi||) nī vemi sesinānu nīgum̐ jĕllunu vĕూpulu girubanela vĕూhiṁchinadānigi (||||) sĕlam̐gi padi muṭṭide sedigi lonauḍagāga salabādidamela javarāligi pilisi perugŏṁṭe bĕrasi vūm̐kŏṁṭagāga valananibiguvela valasinadānigi (||||) vŏggi viḍĕmichchidenu vŏḍi niṁchugŏṁṭagāga siggulu vaḍam̐ganela sinnadānigi diggana sarasamāḍidem̐ jĕnaguḍa gāga yĕggulubaṭṭam̐ganela yichchagabudānigi (||||) sanum̐gava laṁṭidenu sammadiṁchugŏṁṭa gāga pĕnam̐gulāḍam̐ganela priyurāligi yĕnasidivi śhrī veṁkaḍeśha yiṁtalo nannu tanisidim̐ gŏṁkanela tamagabudānigi