Title (Indic)నీ వెఱుఁగని పనులు నేము విన్నవించేమా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ వెఱుఁగని పనులు నేము విన్నవించేమా దేవులు నీకు మొక్కీని తిలకించవయ్యా (॥॥) వొక్కొకవేళ సతులు వూరకే కోపించుకొన్నా అక్కరతో నవ్వుదురు అంతలోననే యెక్కువైన మగవాని కెగ్గులుగఁ బట్టరాదు చెక్కు నొక్కి చనవులు చెల్లించవలెను (॥॥) నెట్టుకొని వొకవేళ నిష్ఠూరము లాడినాను అట్టే ప్రియము చెప్పుదు రంతలోననే చుట్టమైన నాయకుఁడు సూడుఁ బాడు నెంచరాదు జట్టిగొని సరసమే జరపఁగవలెను (॥॥) బలిమితో నొకవేళ పంతములు చూపినాను అలుక దేరి కూడదు రంతలోననే యెలమి శ్రీ వేంకటేశ ఇఁక నేమి ననరాదు కలసి యేలితి విట్టే కరుణించవలెను English(||pallavi||) nī vĕṟum̐gani panulu nemu vinnaviṁchemā devulu nīgu mŏkkīni tilagiṁchavayyā (||||) vŏkkŏgaveḽa sadulu vūrage kobiṁchugŏnnā akkarado navvuduru aṁtalonane yĕkkuvaina magavāni kĕggulugam̐ baṭṭarādu sĕkku nŏkki sanavulu sĕlliṁchavalĕnu (||||) nĕṭṭugŏni vŏgaveḽa niṣhṭhūramu lāḍinānu aṭṭe priyamu sĕppudu raṁtalonane suṭṭamaina nāyagum̐ḍu sūḍum̐ bāḍu nĕṁcharādu jaṭṭigŏni sarasame jarabam̐gavalĕnu (||||) balimido nŏgaveḽa paṁtamulu sūbinānu aluga deri kūḍadu raṁtalonane yĕlami śhrī veṁkaḍeśha im̐ka nemi nanarādu kalasi yelidi viṭṭe karuṇiṁchavalĕnu