Title (Indic)నీ వలమేలుమంగవు నెరజాణఁ డాతఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ వలమేలుమంగవు నెరజాణఁ డాతఁడు వోవరిలో నుండఁగదె వొయ్యారిదానవు (॥నీవ॥) గరిమ నీరమణుఁడు కైదండ వట్టితేను శిరసేల వంచేవే చిన్నారిదాన మరిగి నీ కతఁ డాకుమడిచి చేతి కిచ్చితే వెరగు వడఁగనేలే వియ్యపుదాన (॥నీవ॥) తగ్గకుండా నీతొడలు తలగడఁ బెట్టుకొంటే సిగ్గులేల పెంచేవే చేఁతలదాన యెగ్గులేక నీ చెవిలో నేకతము లాడితేను వెగ్గళించి దూరనేలే వేడుకదాన (॥నీవ॥) గక్కన నీ చన్నులు కాఁగిట నదుముకుంటే మిక్కలి యాల చొక్కేవే మేనదాన యిక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్నుఁగూడె చక్కెరమో వియ్యఁగదె చనవరిదానా English(||pallavi||) nī valamelumaṁgavu nĕrajāṇam̐ ḍādam̐ḍu vovarilo nuṁḍam̐gadĕ vŏyyāridānavu (||nīva||) garima nīramaṇum̐ḍu kaidaṁḍa vaṭṭidenu śhirasela vaṁcheve sinnāridāna marigi nī kadam̐ ḍāgumaḍisi sedi kichchide vĕragu vaḍam̐ganele viyyabudāna (||nīva||) taggaguṁḍā nīdŏḍalu talagaḍam̐ bĕṭṭugŏṁṭe siggulela pĕṁcheve sem̐taladāna yĕggulega nī sĕvilo negadamu lāḍidenu vĕggaḽiṁchi dūranele veḍugadāna (||nīva||) gakkana nī sannulu kām̐giḍa nadumuguṁṭe mikkali yāla sŏkkeve menadāna yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninnum̐gūḍĕ sakkĕramo viyyam̐gadĕ sanavaridānā