Title (Indic)నీ రచన లింతేశాయ నివ్వెరగేల పడేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ రచన లింతేశాయ నివ్వెరగేల పడేవు పౌరకామినులు నిన్నుఁ బంగించితేఁ దప్పా (॥నీర॥) కోరి కోరి పిలువఁగ గుట్టెల్లా బయిటఁబడె సారె సారె నవ్వఁగాను చలివాసెను మారుకొని మాటాడఁగ మందెమేలమాయ నేఁడు తేరి చూచి ఆకె నిన్నుఁ దిట్టకుండునా (॥నీర॥) చెక్కులు నీవు నొక్కఁగా సిగ్గులెల్లాఁ దొలఁగెను చక్కఁగ నీవు మెచ్చఁగ చండిపడెను దక్కి నీవండనుండఁగ తనకు వెఱవు దీరె తక్కక పాదాన నిన్నుఁ దాఁకించక మానునా (॥నీర॥) నీవు గాఁగిలించుకోఁగా నిండురాజసము గప్పె కైవసము గాంగాను కాఁకదేరెను యీవల నలమేల్మంగ యిట్టె వురమెక్కించఁగ శ్రీవేంకటేశ నీసేవ సేయవలదా English(||pallavi||) nī rasana liṁteśhāya nivvĕragela paḍevu pauragāminulu ninnum̐ baṁgiṁchidem̐ dappā (||nīra||) kori kori piluvam̐ga guṭṭĕllā bayiḍam̐baḍĕ sārĕ sārĕ navvam̐gānu salivāsĕnu mārugŏni māḍāḍam̐ga maṁdĕmelamāya nem̐ḍu teri sūsi āgĕ ninnum̐ diṭṭaguṁḍunā (||nīra||) sĕkkulu nīvu nŏkkam̐gā siggulĕllām̐ dŏlam̐gĕnu sakkam̐ga nīvu mĕchcham̐ga saṁḍibaḍĕnu dakki nīvaṁḍanuṁḍam̐ga tanagu vĕṟavu dīrĕ takkaga pādāna ninnum̐ dām̐kiṁchaga mānunā (||nīra||) nīvu gām̐giliṁchugom̐gā niṁḍurājasamu gappĕ kaivasamu gāṁgānu kām̐kaderĕnu yīvala nalamelmaṁga yiṭṭĕ vuramĕkkiṁcham̐ga śhrīveṁkaḍeśha nīseva seyavaladā