Title (Indic)నీ నేరుపేటిదే నిన్నుఁ జూచి వెరగయ్యీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ నేరుపేటిదే నిన్నుఁ జూచి వెరగయ్యీ కానీవే నిన్నెఱుఁగుదు గడుసరిదానవే (॥నీ నేరు॥) నడుమ నీ వూరకె నా మగనితోడుత - నెడమాఁట లాడించే వెంతదానవే వడిగా బువ్వలచెండు వాటుగా నాతని వేసి కడు సన్నసేసే వెంత గయ్యాళిదానవే (॥నీ నేరు॥) వింతగా నాతఁడూ నేనూ వినోదము లాడఁగాను వంతులకు వచ్చే వెంటువంటిదానవే మంతన మాడుతాఁ దెరమాఁటునఁ గూచుండఁగాను రంతుసేసే వేనాటి రట్టడిదానవే (॥నీ నేరు॥) యీకడ శ్రీవేంకటేశుఁ డిటు నాతో నవ్వఁగాను పైకొనఁ జూచేవు నీ వేపాటిదానవే కైకొని నలమేల్మంగ నెదపై నుండఁగాను జోకతోఁ జెనకే వేమి జూటుదానవే English(||pallavi||) nī nerubeḍide ninnum̐ jūsi vĕragayyī kānīve ninnĕṟum̐gudu gaḍusaridānave (||nī neru||) naḍuma nī vūragĕ nā maganidoḍuda - nĕḍamām̐ṭa lāḍiṁche vĕṁtadānave vaḍigā buvvalasĕṁḍu vāḍugā nādani vesi kaḍu sannasese vĕṁta gayyāḽidānave (||nī neru||) viṁtagā nādam̐ḍū nenū vinodamu lāḍam̐gānu vaṁtulagu vachche vĕṁṭuvaṁṭidānave maṁtana māḍudām̐ dĕramām̐ṭunam̐ gūsuṁḍam̐gānu raṁtusese venāḍi raṭṭaḍidānave (||nī neru||) yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiḍu nādo navvam̐gānu paigŏnam̐ jūsevu nī vebāḍidānave kaigŏni nalamelmaṁga nĕdabai nuṁḍam̐gānu jogadom̐ jĕnage vemi jūḍudānave