Title (Indic)నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది శ్రీదేవుఁడవు నీచిత్తము నాభాగ్యము (॥నీదా॥) అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా తనువిధి మలమూత్రములప్రోగు జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా వొనరఁ గర్మమనే వోఁదానఁ బడినది (॥నీదా॥) చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా పొదలిన మతముల పోరాట మది మదిమది నుండిన నామనసే నమ్మితినా అదియును నింద్రియాల కమ్ముడువోయినది (॥నీదా॥) పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా పాత్రమగు రుణానుబంధము లవి చిత్రముగ నన్నుఁ గావు శ్రీవేంకటేశ నీవే పత్రపుష్పమాత్రమే నాభక్తియెల్లా నీకు English(||pallavi||) nī dāsyamŏkkaḍe nilisi nammam̐galadi śhrīdevum̐ḍavu nīsittamu nābhāgyamu (||nīdā||) anuṣhṭhānamulu gadiyani nammi sesidinā tanuvidhi malamūtramulaprogu janulalo nuttamabujanmame nammidinā vŏnaram̐ garmamane vom̐dānam̐ baḍinadi (||nīdā||) saduvula śhāstramula jāḍalu nammidinā pŏdalina madamula porāḍa madi madimadi nuṁḍina nāmanase nammidinā adiyunu niṁdriyāla kammuḍuvoyinadi (||nīdā||) putradāradhanadhānyabhūmulu nammidinā pātramagu ruṇānubaṁdhamu lavi sitramuga nannum̐ gāvu śhrīveṁkaḍeśha nīve patrabuṣhpamātrame nābhaktiyĕllā nīgu