Title (Indic)నెఱజాణ విన్నిటాను నీవెఱఁగవా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నెఱజాణ విన్నిటాను నీవెఱఁగవా మఱి నీచిత్తముకొద్ది మమ్ము మన్నించవయ్యా (॥॥) చెలిమికొలఁదియే చెల్లుబడి కలిమికొఁలదియే కాఁపురము వలపుకొలఁదియే వాడిక తలపుకొలఁదియే తాలిమి (॥॥) పట్టిన కొలఁదియే పంతము చుట్టరికముకొలఁదే సోబనము దిట్టతనముకొలఁదే తేఁకువ నెట్టుకున్న కొలఁదే నిటుకడ (॥॥) కూడినకొలఁదియే కూటమి వేడుకకొలఁదియే విందులు యీడనెశ్రీ వేంకటేశ యెనసితివి యీడుజోడైనకొలఁదే యంపలు English(||pallavi||) nĕṟajāṇa vinniḍānu nīvĕṟam̐gavā maṟi nīsittamugŏddi mammu manniṁchavayyā (||||) sĕlimigŏlam̐diye sĕllubaḍi kalimigŏm̐ladiye kām̐puramu valabugŏlam̐diye vāḍiga talabugŏlam̐diye tālimi (||||) paṭṭina kŏlam̐diye paṁtamu suṭṭarigamugŏlam̐de sobanamu diṭṭadanamugŏlam̐de tem̐kuva nĕṭṭugunna kŏlam̐de niḍugaḍa (||||) kūḍinagŏlam̐diye kūḍami veḍugagŏlam̐diye viṁdulu yīḍanĕśhrī veṁkaḍeśha yĕnasidivi yīḍujoḍainagŏlam̐de yaṁpalu