Title (Indic)నవ్వేవంటా నుండితిమి నమ్మి యిందాఁకా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నవ్వేవంటా నుండితిమి నమ్మి యిందాఁకా జవ్వనపుదానను సాదించక మానను (॥నవ్వే॥) వలపులు రేఁచితివి వాసులెల్లఁబూఁచితివి చెలుల సుద్దులు మాతోఁ జెప్పి చెప్పి మలకల సట లివి మాతోనే వద్దు సుమ్మీ పెలుచుఁబంతాలదానఁ బెనఁగక మానను (॥నవ్వే॥) ఆసలు వుట్టించితివి ఆయాలు పట్టించితివి వేసాల సతులఁ గొనవేసి వేసి ఆ సుద్దులు మమ్ము నిఁక నల ఇంచ వద్దు సుమ్మీ బేస బెల్లితనమునఁ బెనఁగక మానను (॥నవ్వే॥) కన్నుల సన్నలు చేసి కాఁగిట సారెకు డాసి పన్నితి మాయ లింతులఁ బాడి పాడి మున్నిటి శ్రీ వేంకటేశ మోసములు వద్దు సుమ్మీ కన్నెను నేఁ గూడితిని గద్దించకమానను English(||pallavi||) navvevaṁṭā nuṁḍidimi nammi yiṁdām̐kā javvanabudānanu sādiṁchaga mānanu (||navve||) valabulu rem̐sidivi vāsulĕllam̐būm̐sidivi sĕlula suddulu mādom̐ jĕppi sĕppi malagala saḍa livi mādone vaddu summī pĕlusum̐baṁtāladānam̐ bĕnam̐gaga mānanu (||navve||) āsalu vuṭṭiṁchidivi āyālu paṭṭiṁchidivi vesāla sadulam̐ gŏnavesi vesi ā suddulu mammu nim̐ka nala iṁcha vaddu summī besa bĕllidanamunam̐ bĕnam̐gaga mānanu (||navve||) kannula sannalu sesi kām̐giḍa sārĕgu ḍāsi pannidi māya liṁtulam̐ bāḍi pāḍi munniḍi śhrī veṁkaḍeśha mosamulu vaddu summī kannĕnu nem̐ gūḍidini gaddiṁchagamānanu