Title (Indic)నమ్మితిఁ జుమ్మీ వో మనసా నాకే హితవయి మెలంగుమీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నమ్మితిఁ జుమ్మీ వో మనసా నాకే హితవయి మెలంగుమీ ముమ్మాటికి నేఁ జెప్పితిఁ జుమ్మీ మురహరునామమే జపించుమీ (॥నమ్మి॥) తలఁచకుమీ యితరధర్మములు తత్వజ్ఞానము మఱవకుమీ కలఁగకుమీ యేపనికైనను కడుశాంతంబుననుండుమీ వలవకుమీ వనితలకెప్పుడు వైరాగ్యంబున నుండుమీ కొలువకుమీ యితరదైవములు గోవిందునినే భజించుమీ (॥నమ్మి॥) కోరకుమీ దేహభోగములు గొనకొని తపమే చేకొనుమీ మీరకుమీ గురువులయానతి మెఱయఁ బురాణములే వినుమీ చేరకుమీ దుర్జనసంగతి జితేంద్రియుఁడవై నిలువుమీ దూరకుమీ కర్మఫలంబును ధ్రువవరదునినే నుతించుమీ (॥నమ్మి॥) వెఱవకుమీ పుట్టుగులకు మరి వివేకించి ధీరుఁడవగుమీ మఱవకుమీ యలమేల్మంగకుమగఁడగుశ్రీవేంకటపతిని కెఱలకుమీ మాయారతులను కేవలసాత్వికుఁడవుగమ్మీ తొఱలకుమీ నేరములను సింధురక్షకునినే సేవించుమీ English(||pallavi||) nammidim̐ jummī vo manasā nāge hidavayi mĕlaṁgumī mummāḍigi nem̐ jĕppidim̐ jummī muraharunāmame jabiṁchumī (||nammi||) talam̐sagumī yidaradharmamulu tatvajñānamu maṟavagumī kalam̐gagumī yebanigainanu kaḍuśhāṁtaṁbunanuṁḍumī valavagumī vanidalagĕppuḍu vairāgyaṁbuna nuṁḍumī kŏluvagumī yidaradaivamulu goviṁdunine bhajiṁchumī (||nammi||) koragumī dehabhogamulu gŏnagŏni tabame segŏnumī mīragumī guruvulayānadi mĕṟayam̐ burāṇamule vinumī seragumī durjanasaṁgadi jideṁdriyum̐ḍavai niluvumī dūragumī karmaphalaṁbunu dhruvavaradunine nudiṁchumī (||nammi||) vĕṟavagumī puṭṭugulagu mari vivegiṁchi dhīrum̐ḍavagumī maṟavagumī yalamelmaṁgagumagam̐ḍaguśhrīveṁkaḍabadini kĕṟalagumī māyāradulanu kevalasātvigum̐ḍavugammī tŏṟalagumī neramulanu siṁdhurakṣhagunine seviṁchumī