Title (Indic)నాకుఁ దెలుసుఁగా నీ నాటకాలెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నాకుఁ దెలుసుఁగా నీ నాటకాలెల్లా యీకడ నేమి సేసేవు యింటికి రావయ్యా (॥నాకు॥) తలపోఁత లొకతెపైఁ దగిలి నీకుండఁగాను పిలిచితేఁ బలికేవా ప్రియముతోను యెలమి నీమాయలు యెరఁగని సతులెల్లా అలిగి వున్నాఁడవంటా నటు వేఁడుకొందురు (॥నాకు॥) యెడయ కెవ్వతో యింటికేఁగఁ గాచుకుండఁగాను వొడి వట్టితే వచ్చేవా వూరకే నీవు అడరి నీవోజ దెలియనివనితలెల్లాను కడుఁ బంతగాఁడవంటా కాళ్ళకు మొక్కుదురు (॥నాకు॥) అక్కున నలమేల్మంగ ఆలై నీకునుండఁగాను దక్కేవా శ్రీవెంకటేశ తరుణులకు యిక్కడ నన్నేలతివి యేడనైనా వింత వారు చొక్కి తగవరివంటా సుద్దులు చెప్పుదురు English(||pallavi||) nāgum̐ dĕlusum̐gā nī nāḍagālĕllā yīgaḍa nemi sesevu yiṁṭigi rāvayyā (||nāgu||) talabom̐ta lŏgadĕbaim̐ dagili nīguṁḍam̐gānu pilisidem̐ baligevā priyamudonu yĕlami nīmāyalu yĕram̐gani sadulĕllā aligi vunnām̐ḍavaṁṭā naḍu vem̐ḍugŏṁduru (||nāgu||) yĕḍaya kĕvvado yiṁṭigem̐gam̐ gāsuguṁḍam̐gānu vŏḍi vaṭṭide vachchevā vūrage nīvu aḍari nīvoja dĕliyanivanidalĕllānu kaḍum̐ baṁtagām̐ḍavaṁṭā kāḽḽagu mŏkkuduru (||nāgu||) akkuna nalamelmaṁga ālai nīgunuṁḍam̐gānu dakkevā śhrīvĕṁkaḍeśha taruṇulagu yikkaḍa nanneladivi yeḍanainā viṁta vāru sŏkki tagavarivaṁṭā suddulu sĕppuduru