Title (Indic)నాకెట్లఁ దెలుసు నిన్ను నమ్మఁగలదానఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నాకెట్లఁ దెలుసు నిన్ను నమ్మఁగలదానఁ గాక యీకడాకడ నీయిత వెట్లున్నదో (॥నాకె॥) శిరసువంచక లేమసిగ్గే నినుఁ జూచి నవ్వె అరియ నీవాకె కేమౌదువోకాని వొరసి నాపై నీవు వద్దనుందు వింతేకాక యిరవై యెఱఁగకుండ యేమిసేతువో (॥నాకె॥) మచ్చిక నొకవనిత మాట దగులఁగ నాడె యిచ్చట నీకును నాకె కేపొందులో వచ్చి నాయెదుట ముగుదవలె నుందు వింతేకాక యెచ్చట నెవ్వరియిండ్ల కేఁగుదువో నీవు (॥నాకె॥) నిక్కుచు నొకసతి నీకాలు దొక్కెనిదె యెక్కడ మీయిద్దరిలో నేపంతమో యిక్కువ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి యెక్కువ నీతను వెట్ల నెందెందు మోచెనో English(||pallavi||) nāgĕṭlam̐ dĕlusu ninnu nammam̐galadānam̐ gāga yīgaḍāgaḍa nīyida vĕṭlunnado (||nāgĕ||) śhirasuvaṁchaga lemasigge ninum̐ jūsi navvĕ ariya nīvāgĕ kemauduvogāni vŏrasi nābai nīvu vaddanuṁdu viṁtegāga yiravai yĕṟam̐gaguṁḍa yemiseduvo (||nāgĕ||) machchiga nŏgavanida māḍa dagulam̐ga nāḍĕ yichchaḍa nīgunu nāgĕ kebŏṁdulo vachchi nāyĕduḍa mugudavalĕ nuṁdu viṁtegāga yĕchchaḍa nĕvvariyiṁḍla kem̐guduvo nīvu (||nāgĕ||) nikkusu nŏgasadi nīgālu dŏkkĕnidĕ yĕkkaḍa mīyiddarilo nebaṁtamo yikkuva śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi yĕkkuva nīdanu vĕṭla nĕṁdĕṁdu mosĕno