Title (Indic)నాటకమునకు మాతో నవ్వేవు గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నాటకమునకు మాతో నవ్వేవు గాక మాటమాత్రపువారిని మన్నించేవా (॥నాట॥) అంటి వూడిగాలు సేసేఅతివలు నీకుండఁగా యింటిలో సతులపొందు యింపు వుట్టీనా దంటలై నసతు లెల్లా దగ్గరి కొసరఁగాను వెంట వచ్చేగుట్టుతోడివెలఁదుల మెచ్చేవా (॥నాట॥) పోరచి వెట్టే వారు పొరుగున నుండఁగాను మేరతోడికామినుల మేకొనేవా సారెఁ దరితీవు సేసేసతులు పై కొనఁగాను ఆరీతి కాంతలపై నాస వుట్టీనా (॥నాట॥) సన్నలనే యెలయించేతులు కామ కియ్యఁగా పన్ని పట్టపుదేవుళ్ళు బాఁతయ్యేరా యిన్నిటా శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి వున్న వారిమీఁద నీకు నున్నదా మనసు English(||pallavi||) nāḍagamunagu mādo navvevu gāga māḍamātrabuvārini manniṁchevā (||nāḍa||) aṁṭi vūḍigālu seseadivalu nīguṁḍam̐gā yiṁṭilo sadulabŏṁdu yiṁpu vuṭṭīnā daṁṭalai nasadu lĕllā daggari kŏsaram̐gānu vĕṁṭa vachcheguṭṭudoḍivĕlam̐dula mĕchchevā (||nāḍa||) porasi vĕṭṭe vāru pŏruguna nuṁḍam̐gānu meradoḍigāminula megŏnevā sārĕm̐ daridīvu sesesadulu pai kŏnam̐gānu ārīdi kāṁtalabai nāsa vuṭṭīnā (||nāḍa||) sannalane yĕlayiṁchedulu kāma kiyyam̐gā panni paṭṭabudevuḽḽu bām̐tayyerā yinniḍā śhrī veṁkaḍeśha yiḍu nannu nelidivi vunna vārimīm̐da nīgu nunnadā manasu