Title (Indic)నాపై బత్తి గలఁడే నావిభుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నాపై బత్తి గలఁడే నావిభుఁడు యేపొద్దూ నా సంతోస మేమని చెప్పుదునే (॥నాపై॥) చెనకక తనతోను సిగ్గువడి నే నుండఁగా మనసిచ్చి తానే నాతో మాటలాడీనే తనివొంది నాలో నేనే తలవంచుకుండఁగాను చనవిచ్చి యప్పటిని సరసములాడీనే (॥నాపై॥) చాయసేసుక కంబముచాటున నే నుండఁగాను చేయివట్టి తీసి నాచెక్కు నొక్కీనే కాయమెల్లా పయ్యదను కప్పుకొని వుండఁగాను ఆయములంటి నన్ను నాదరించీనే (॥నాపై॥) వేడుకతోఁ దనవొద్ద వేళగాచుకుండఁగాను వాడుదేర నింత నన్ను వలపించీనే యీడనే శ్రీవేంకటేశుఁ డెదుట నే నుండఁగాను కూడి నన్ను నిందరిలో కొంకక యీడేర్చెనే English(||pallavi||) nābai batti galam̐ḍe nāvibhum̐ḍu yebŏddū nā saṁtosa memani sĕppudune (||nābai||) sĕnagaka tanadonu sigguvaḍi ne nuṁḍam̐gā manasichchi tāne nādo māḍalāḍīne tanivŏṁdi nālo nene talavaṁchuguṁḍam̐gānu sanavichchi yappaḍini sarasamulāḍīne (||nābai||) sāyasesuga kaṁbamusāḍuna ne nuṁḍam̐gānu seyivaṭṭi tīsi nāsĕkku nŏkkīne kāyamĕllā payyadanu kappugŏni vuṁḍam̐gānu āyamulaṁṭi nannu nādariṁchīne (||nābai||) veḍugadom̐ danavŏdda veḽagāsuguṁḍam̐gānu vāḍudera niṁta nannu valabiṁchīne yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍĕduḍa ne nuṁḍam̐gānu kūḍi nannu niṁdarilo kŏṁkaga yīḍersĕne