Title (Indic)నాపాలి ఘననిధానమవు నీవే నన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నాపాలి ఘననిధానమవు నీవే నన్ను నీ పాల నిడుకొంటి నీవే నీవే (॥నాపాలి॥) ఒలిసి నన్నేలె దేవుఁడవు నీవే, యెందుఁ దొలగని నిజబంధుఁడవు నీవే పలుసుఖమిచ్చేసంపదవునీవే, యిట్టే వెలయ నిన్నియును నీవే నీవే (॥నాపాలి॥) పొదిగి పాయని యాప్తుఁడవు నీవే, నాకు నదనఁ దోడగుదేహమవు నీవే మదమువాపెడి నామతియు నీవే, నాకు వెదక నన్నియును నీవే నీవే (॥నాపాలి॥) యింకా లోకములకు నెప్పుడు నీవే, యీ పంకజభవాదిదేవపతివి నీవే అంకలి వాపఁగ సంతకు నీవే తిరు- వేంకటేశ్వరుఁడవు నీవే నీవే English(||pallavi||) nābāli ghananidhānamavu nīve nannu nī pāla niḍugŏṁṭi nīve nīve (||nābāli||) ŏlisi nannelĕ devum̐ḍavu nīve, yĕṁdum̐ dŏlagani nijabaṁdhum̐ḍavu nīve palusukhamichchesaṁpadavunīve, yiṭṭe vĕlaya ninniyunu nīve nīve (||nābāli||) pŏdigi pāyani yāptum̐ḍavu nīve, nāgu nadanam̐ doḍagudehamavu nīve madamuvābĕḍi nāmadiyu nīve, nāgu vĕdaga nanniyunu nīve nīve (||nābāli||) yiṁkā logamulagu nĕppuḍu nīve, yī paṁkajabhavādidevabadivi nīve aṁkali vābam̐ga saṁtagu nīve tiru- veṁkaḍeśhvarum̐ḍavu nīve nīve