Title (Indic)నాపాటిదానవా నానారీతుల నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నాపాటిదానవా నానారీతుల నీవు యేపున నీ మనసులో నెంచి చూచుకొనవే (॥నాపా॥) మగఁడు మన్నించునంటా మాఁట జవదాఁటఁడంటా పగటు లేమి చెప్పేవే పలుమారును బిగువులు చూపుకొంటా పెద్దకొప్పు వెట్టుకొంటా నగువు లెంత నవ్వేవే నడుమ నీవు (॥నాపా॥) చక్కని దాననంటా సరిగె గలదంటాను వెక్కాసి వెంతైతివే వెల్లివిరితో నిక్కి నిక్కి చూచుకొంటా నీటులు నెరపుకొంటా చొక్కి యేమి మురిసేవే జూటరివై నీవు (॥నాపా॥) పాయపు దాననంటా బలిమి కత్తెనంటా మాయలేమి సేసేవే మతకానను యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె ఆయము లేలంటేవే యాతని ముట్టి నీవు English(||pallavi||) nābāḍidānavā nānārīdula nīvu yebuna nī manasulo nĕṁchi sūsugŏnave (||nābā||) magam̐ḍu manniṁchunaṁṭā mām̐ṭa javadām̐ṭam̐ḍaṁṭā pagaḍu lemi sĕppeve palumārunu biguvulu sūbugŏṁṭā pĕddagŏppu vĕṭṭugŏṁṭā naguvu lĕṁta navveve naḍuma nīvu (||nābā||) sakkani dānanaṁṭā sarigĕ galadaṁṭānu vĕkkāsi vĕṁtaidive vĕllivirido nikki nikki sūsugŏṁṭā nīḍulu nĕrabugŏṁṭā sŏkki yemi muriseve jūḍarivai nīvu (||nābā||) pāyabu dānanaṁṭā balimi kattĕnaṁṭā māyalemi seseve madagānanu yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ āyamu lelaṁṭeve yādani muṭṭi nīvu