Title (Indic)నా యంతనే వుద్దండంబున నీ నగరు చొచ్చి సోధించఁగ లేదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా యంతనే వుద్దండంబున నీ నగరు చొచ్చి సోధించఁగ లేదు పాయక నను మన్నించి యేలుకో నీ ప్రకాశ మౌట మేలు (॥నాయంత॥) ధరలో నీ రూపము నీవే దాఁచుకొని యుండఁగను గరుడధ్వజమే నీ గుఱుతు కనుపించెను నాకు బిరుదులు వొగడే శృతులచేతనే పరరేఁగితి నేను పరగిన నీ ప్రతాపతేజమె బయలుసేసె నిన్ను (॥నాయంత॥) యెవ్వరికి నసాధ్యుఁడవై నీవు యేకతమున నుండఁగాను రవ్వసేసి నిను నాకుఁ దెలిపెను రచనల నీ మహిమె చువ్వన నీ విచ్చు వరదహస్తమె చొప్పుచూపఁగాఁ గంటిని నివ్వటిల్లు నీ కరుణ యిందరికి ని న్నిటువలెనే ముంగిటఁ బెట్టె (॥నాయంత॥) శ్రీవేంకటగిరిపై రహస్యమునఁ జెలఁగుచు నుండఁగాను భావింప నలమేల్మంగ సంపదలె పట్టిచ్చెను నీ ప్రభావము దైవికమునఁ బ్రకటించిన తొంటివుదారగుణము వినిశరణుచొచ్చితిమి యీవల నావల మీ చిహ్నములే యింత సేసె మిమ్ము English(||pallavi||) nā yaṁtane vuddaṁḍaṁbuna nī nagaru sŏchchi sodhiṁcham̐ga ledu pāyaga nanu manniṁchi yelugo nī pragāśha mauḍa melu (||nāyaṁta||) dharalo nī rūbamu nīve dām̐sugŏni yuṁḍam̐ganu garuḍadhvajame nī guṟudu kanubiṁchĕnu nāgu birudulu vŏgaḍe śhṛtulasedane pararem̐gidi nenu paragina nī pradābadejamĕ bayalusesĕ ninnu (||nāyaṁta||) yĕvvarigi nasādhyum̐ḍavai nīvu yegadamuna nuṁḍam̐gānu ravvasesi ninu nāgum̐ dĕlibĕnu rasanala nī mahimĕ suvvana nī vichchu varadahastamĕ sŏppusūbam̐gām̐ gaṁṭini nivvaḍillu nī karuṇa yiṁdarigi ni nniḍuvalĕne muṁgiḍam̐ bĕṭṭĕ (||nāyaṁta||) śhrīveṁkaḍagiribai rahasyamunam̐ jĕlam̐gusu nuṁḍam̐gānu bhāviṁpa nalamelmaṁga saṁpadalĕ paṭṭichchĕnu nī prabhāvamu daivigamunam̐ bragaḍiṁchina tŏṁṭivudāraguṇamu viniśharaṇusŏchchidimi yīvala nāvala mī sihnamule yiṁta sesĕ mimmu